ఉన్నట్లుండి ఫోన్‌ ఛార్జింగ్‌ పడిపోతోందా? పెద్ద రిస్కే! ఇలా చేస్తే బెటర్‌

18 Oct, 2021 12:01 IST|Sakshi

Smart Phone Safety Tips: భయపెట్టడానికి కాదు.. ఇది ముమ్మాటికీ మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రమాదంలో పడిందని చెప్పడానికే!.  ట్రోజాన్స్‌, స్పైవేర్‌, రాన్‌సమ్‌వేర్‌, యాడ్‌వేర్‌, వార్మ్స్‌, ఫైల్‌లెస్‌ వండర్స్‌.. ఇలా రకరకాల పేర్లు, వెర్షన్‌లతో జరిగేవన్నీ సైబర్‌ఎటాక్స్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే.  లాక్‌డౌన్ టైం నుంచి ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్‌ మీటింగ్‌లంటూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్‌ వాడకం పెరిగింది. ఇదే సైబర్‌ నేరాల సంఖ్య పెరగడానికి కారణమైందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెప్తున్నాయి.  


యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌, లింక్స్‌ ద్వారా యూజర్‌ మొబైల్స్‌లోకి వైరస్‌ నుంచి పంపి వారి విలువైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త తరహాలో సాగుతున్న సైబర్‌దాడులు, ఫోన్‌లో వైరస్‌ ఉనికి ఎలా గుర్తించాలి? వైరస్‌ బారి నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలి? నిపుణులేమంటున్నారో చూద్దాం.  

ఎలా గుర్తించాలంటే..

ఫోన్‌ ఒక్కోసారి స్లో అవుతుంది.  సమస్య ఏంటో తెలియక కొందరు స్పేస్‌ ఫ్రీ చేస్తుంటారు. లేదంటే రీస్టార్ట్‌ చేస్తారు. అయినా ఫోన్‌ పనితీరు మారదు!. ఎందుకంటే ఆ ఫోన్‌ డాటా అప్పటికే ప్రమాదంలో పడినట్లేనని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు.

ఫోన్‌ రీఛార్జి, ఏదైనా బిల్లులు చెల్లించినప్పుడు, ట్రాన్‌జాక్షన్స్‌ జరిపినప్పుడు.. వెంటనే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు(అన్‌మార్క్‌) వస్తుంటాయి. 

  ఎలాంటి యాప్స్‌ ఓపెన్‌ చేసినా.. యాడ్స్‌ విపరీతంగా డిస్‌ప్లే అవుతుంటాయి.

కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నెంబర్ల నుంచి సందేశాలు, లింక్‌లు వస్తాయి. క్లిక్‌ చేస్తే డాటా రిస్క్‌లో పడినట్లే!. 

 ఫోన్‌ పర్‌ఫార్మెన్స్‌ పూర్తిగా నెమ్మదిస్తుంది.

కొత్త యాప్‌ల ద్వారా కూడా వైరస్‌, మాల్‌వేర్‌ ఫోన్‌ ఛాన్స్‌ ఉంటుంది. 

 సైబర్‌ ఎటాక్‌ ప్రభావంతో ఇంటర్నెట్‌ డేటా కూడా త్వరగతిన అయిపోతుంది. 

ఫోన్‌ బ్యాటరీ టైం తగ్గిపోవడం.. లేదంటే ఉన్నట్లుండి సడన్‌గా బ్యాటరీ పర్సంటేజ్‌ పడిపోతుంది. 

యూజర్‌ ప్రమేయం లేకుండా అవతలి వాళ్లకు ఫోన్‌ నుంచి ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు వెళ్తుంటాయి. అలాగే యాప్‌ల కొనుగోళ్లు జరుగుతుంది. 

ఏం చేయాలంటే.. 

యాంటీవైరస్‌ స్కాన్‌ ద్వారా గుర్తించొచ్చు. 

యాప్స్‌.. సైబర్‌ దాడులకు ఒక ముఖ్యకారణం. అందుకే యాప్‌ స్టోర్‌లలో వెరిఫై చేసుకున్నాకే డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

టెక్స్ట్‌ మెసేజ్‌, లింక్స్‌ విషయంలో జాగ్రత్త అవసరం.

మొబైల్‌ ట్రాన్‌జాక్షన్స్‌ టైంలో వచ్చే యాడ్స్‌, లింక్స్‌ను క్లిక్‌ చేయొద్దు. అప్రమత్తంగా ఉండాలి.

అలానే రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సదరు యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

యాప్‌ పేరులో అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఉంటే మాత్రం వాటి జోలికెళ్లద్దు

ఒకవేళ ఫోన్‌లో పై సమస్యలేవైనా ఎదురైతే.. అవసరం లేని యాప్స్‌(ప్లేస్టోర్‌, ఏపీకే అయినా) తొలగించాలి. 

 అవసరం అనుకుంటే ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ఉత్తమం.

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌
 

క్లిక్‌ చేయండి: సరికొత్త ఆఫర్‌...మనీ యాడ్‌ చేస్తే...20 శాతం బోనస్‌..!

మరిన్ని వార్తలు