Disconnect Gmail For Uninstalled Apps: మీ ఫోన్‌లో యాప్స్‌ డిలీట్‌ చేసిన తర్వాత ఈ పని చేస్తున్నారా!

27 May, 2022 19:58 IST|Sakshi

సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్‌ ఫోన్‌లో యాప్స్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్‌ చేస్తాం. కానీ యాప్స్‌ డిలీట్‌ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌లు కొన్నిసార్లు ఇరిటేషన్‌ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్‌ అన్‌ ఇన్‌ స్టాల్‌ చేసినా నోటిఫికేషన్‌లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూజర్లు యాప్స్‌ డిలీట్‌ చేసిన వెంటనే ఇంకో పనిచేయాల్సి ఉంటుంది. అదేంటంటే!


స్మార్ట్‌ ఫోన్‌కి జీమెయిల్‌ అకౌంట్‌ లింక్‌ అయి ఉంటుంది. మరి యాప్స్‌ డిలీట్‌ చేస్తే..ఆ యాప్స్‌కు అటాచ్‌ అయిన జీమెయిల్‌ అకౌంట్‌ డిస్‌ కనెక్ట్‌ అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదు. దీంతో ఈజీగా జీమెయిల్‌లో ఉన్న మన పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ అంతా లీక్‌ అవుతుంది. అందుకే యాప్స్‌ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత మ్యాన్యువల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌కు కనెక్ట్‌ అయిన జీమెయిల్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేయాలి. 

ఇప్పుడు మనం స్మార్ట్‌ ఫోన్‌లో యాప్స్‌కు కనెక్టైన జీమెయిల్‌ను ఎలా డిలీట్‌ చేయాలో తెలుసుకుందాం. 

ముందుగా ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి

అనంతరం సెట్టింగ్‌లో ఉన్న గూగుల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి

గూగుల్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్‌ పర్‌ గూగుల్‌ యాప్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 

క్లిక్‌ చేస్తే కనెక్టెడ్ యాప్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

ఆ కనెక్టెడ్ యాప్స్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీ యాక్టీవ్‌గా జీ మెయిల్‌కు ఏ యాప్స్‌ అటాచై ఉన్నాయో తెలుస్తోంది. వెంటనే ఆ యాప్స్‌ మీద క్లిక్‌ చేసి జీమెయిల్‌ అకౌంట్‌ను డిస్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు