5 నిమిషాల్లో ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?

22 Jul, 2021 20:00 IST|Sakshi

ఈపీఎఫ్ లేదా పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్ లైన్ లో యూఏఎన్ ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్‌ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది.

యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది.

యూఏఎన్ నెంబర్ జనరేట్  చేయు విధానం:

  • మొదట మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Important Links విభాగంలో ఉన్న Direct UAN Allotment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • మీరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • ఏదైనా ప్రయివేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ మెంట్ లేదా ఆర్గనైజేషన్ లో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే 'అవును' మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు "ఎంప్లాయిమెంట్ కేటగిరీ" ఎస్టాబ్లిష్ మెంట్ పీఎఫ్ కోడ్ నెంబరు, చేరిన తేదీ, ఐడీని ఎంచుకోవాలి.
  • మళ్లీ ఆధార్ నెంబరు చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది.
  • చివరగా వ్యక్తిగత వివరాలు, కెవైసీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
  • అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి.
  • యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

మరిన్ని వార్తలు