మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

23 Sep, 2021 21:23 IST|Sakshi

పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం దగ్గరి నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో పాన్ కార్డు అవసరం పడుతూ వస్తుంది. అందుకే పాన్ కార్డును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ పాన్ కార్డు కనిపించకుండాపోతే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ పాన్ కార్డు కోసం అప్లిచేసుకోవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనే డూప్లికేట్ ఈ-పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

ఈ-పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

  • ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ఓపెన్ చేయండి
  • డౌన్‌లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ పాన్ నెంబరు,  ఆధార్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది.
  • మీ పుట్టిన తేదీని నమోదు చేసి, నియమ నిబంధనలను ఆమోదించండి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటీపీని అందుకుంటారు.
  • ఓటీపీ ధృవీకరించిన తర్వాత పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ మీ ముందు కనిపిస్తుంది.
  • మీరు రూ.8.26 చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేటిఎమ్, యుపీఐ, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.
  • మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు పేమెంట్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. దీనికి పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాన్ కార్డును కోల్పోతే, మీరు ఒకేసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది కాకుండా, మీ పాన్ తో ఏదైనా బినామీ లావాదేవీ జరిగిందా లేదా అని ఫారం 26ఎఎస్ నుంచి మీరు తెలుసుకోవచ్చు.(చదవండి: రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు)

మరిన్ని వార్తలు