ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం!

27 Jun, 2021 19:05 IST|Sakshi

మన దేశంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఇప్పుడు ఆధార్ కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్ల వాడి నుంచి 60 ఏళ్ల వృద్దిడి వరకు ప్రతి ఒక్కరికీ దీనితో చాలా అవసరం ఉంటుంది. చివరికి కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్నే ప్రధానంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. పలు రకాల సేవలను ఆన్లైన్లోనే అందిస్తోంది. మాస్క్డ్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఐడీఏఐ. 

ఈ ఫీచర్ వల్ల మీ ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరుతుంది. కొత్తగా తీసుకొచ్చిన ‎మాస్క్ ఆధార్ ఆప్షన్ వల్ల మీరు డౌన్‌లోడ్  చేసిన ఈ-ఆధార్ లో మొదటి 8 అంకెలను "ఎక్స్ ఎక్స్ ఎక్స్" వంటి కొన్ని అక్షరాలతో భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో మీ ఆధార్ నెంబరు చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల మీ ఆధార్ ఇతరులు తెలుసుకోలేరని యూఐడీఏఐ పేర్కొంది. ఇతర వివరాలు అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి. ఈ ఫీచర్ మీ కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది. 

మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

  • మొదట యూఐడీఏఐ వెబ్ సైట్(https://uidai.gov.in/) ఓపెన్ చేయండి.
  • "మై ఆధార్ ఆప్షన్" ఎంచుకోండి.
  • "మై ఆధార్" ట్యాబ్ కింద 'డౌన్‌లోడ్ ఆధార్' మీద క్లిక్ చేయండి.
  • ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్, ఎన్ రోల్ మెంట్ ఐడీ(ఈఐడీ), వర్చువల్ ఐడీ(విఐడీ) 3 ఆప్షన్లు ఉన్నాయి. 
  • పై ఆప్షన్ లన్నింటిలో ఏదో ఒకటి ఎంచుకొని 'I want a masked Aadhaar?' అనే దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు క్యాప్చ ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
  • వెబ్ సైట్ లో ఓటీపీని నమోదు చేసి మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

చదవండి:  జూలై ఒకటి నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్!

మరిన్ని వార్తలు