యూట్యూబ్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేయండి ఇలా...

14 Aug, 2021 20:41 IST|Sakshi

యూట్యూబ్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో ఒకటి. మనలో చాలా మంది యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం. నెట్‌వర్క్‌ సరిగ్గా లేనప్పుడు వీడియోలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఆఫ్‌లైన్‌ ద్వారా ఫలానా వీడియోలను చూడటానికి యూట్యూబ్‌ అనుమతినిస్తుంది. వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక తీరిక సమయంలో చూడవచ్చును. ఈ వీడియోలు మాత్రం మీ ఫోన్‌ లోకల్‌ స్టోరేజీలో కనిపించవు​. వీడియోలను మొబైల్‌ లోకల్‌ స్టోరేజ్‌లో కన్పించాలంటే కొన్ని సులభమైన పద్దతులతో యూట్యూబ్‌ వీడియోలను మొబైల్‌ లోకల్‌ స్టోరేజీలో స్టోర్‌ చేసుకోవచ్చును.

యూట్యూబ్‌ వీడియోలను మీ మొబైల్‌ లోకల్‌ స్టోరేజ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకునేవారు థర్డ్‌పార్టీ యాప్‌పై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. స్నాప్‌ట్యూబ్‌ యాప్‌ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వీడియోలను మొబైల్‌ లోకల్‌ స్టోరేజ్‌లో పొందవచ్చును. ఈ యాప్ సహాయంతో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌,  ఇతర ప్లాట్‌ఫాంల  వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఆండ్రాయిడ్ యూజర్లు కేవలం Snaptubeapp.com ని సందర్శించి తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న యూట్యూబ్‌ వీడియోను అడ్రస్‌ను స్నాప్‌ట్యూబ్ యాప్ సెర్చ్ బార్‌లో యూఆర్‌ఎల్‌ని కాపీ-పేస్ట్ చేయాలి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో థర్డ్‌పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయకూడదనుకుంటే..మరో పద్దతిని ఉపయోగించి వీడియోలను డౌన్‌లోడ్‌ చేయవచ్చును. “En.savefrom.net” వెబ్‌సైట్‌లో యూట్యూబ్‌ వీడియోల యూఆర్‌ఎల్‌ను పేస్ట్‌ చేయడం ద్వారా వీడియోలను డౌన్‌లోడ్‌ చేయవచ్చును. అంతేకాకుండా వీడియో రిసల్యూషన్‌ కూడా మనము ఎంపిక చేసుకోవచ్చును.  ఈ పద్ధతి డెస్క్‌టాప్, మొబైల్ రెండింటికీ పని చేస్తుంది.
 

మరిన్ని వార్తలు