మెటర్నిటీ బీమా క్లెయిమ్‌ .. ఇలా సులభతరం

13 Jun, 2022 09:13 IST|Sakshi

యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ఇటీవలి గణాంకాల ప్రకారం 2017లో ప్రసూతి సంబంధ కారణాలతో 2,95,000 మంది మహిళలు మరణించారు. వీటిలో చాలా మటుకు మరణాలు నివారించతగినవే. సాధారణంగా మెట ర్నిటీ, తత్సంబంధ వ్యయాలనేవి జీవితంలో భాగ మే అయినా ముందుగా ఊహించని వైద్య ఖర్చులేవైనా ఎదురైతే ఆర్థికంగా సన్నద్ధంగా ఉండాలి. ఇందుకు మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ ఉపయోగపడుతుంది. దీనితో నార్మల్, సిజేరియన్‌ డెలివరీలకు కవరేజీ లభిస్తుంది. అయితే, పాలసీ, కవరేజీ రకాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. సాధారణంగా మెటర్నిటీ ప్లాన్లలో కవర్‌ అయ్యేవి చూస్తే.. ఏవైనా సమస్యల వల్ల గర్భాన్ని తొలగించాల్సి రావడం, నిర్దిష్ట పరిమితి వరకూ నవజాత శిశువుకు కూడా కవరేజీ మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రసవానికి ముందు, తర్వాత అయ్యే ఖర్చులు (డాక్టర్‌ కన్సల్టేషన్, రూమ్‌ చార్జీలు మొదలైనవి) కూడా కవర్‌ అవుతాయి. ఇక, ప్రీ–హాస్పిటలైజేషన్‌ ఖర్చులకూ (అడ్మిషన్‌ తేదికి ముందు 30 రోజుల వరకు అయ్యే వ్యయాలు) కవరేజీ ఉంటుంది. 

క్లెయిమ్‌ ప్రక్రియ .. 
ఇన్సూరెన్స్‌ సంస్థ, సౌకర్యాన్ని బట్టి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ మార్గాల్లో మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేయొచ్చు. ఆస్పత్రిని బట్టి క్యాష్‌లెస్‌ లేదా రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌ ప్రక్రియను ఎంచుకునే పక్షంలో...

- డెలివరీకి ఆస్పత్రిలో చేరుతున్న విషయాన్ని బీమా సంస్థకు ముందుగా తెలియజేసి, అవసరమైన వివరాలు ఇవ్వాలి.

- ఆ తర్వాత క్లెయిమ్‌ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన పత్రాలతో కలిపి సమర్పించాలి.

- వివరాలను బీమా సంస్థ ప్రతినిధితో వె రిఫై చేయించుకోవాలి.

- మరోవైపు, ఆఫ్‌లైన్‌ విషయానికొస్తే ఆయా పత్రాలను సమీపంలోని బీమా సంస్థ బ్రాంచ్‌లో సమర్పించి, క్లెయిమ్‌ను ఫైల్‌ చేయాలి.

- క్లెయిమ్‌ ప్రక్రియ సులభతరంగా ఉండాలంటే పాలసీ పత్రాలు, క్లెయిమ్‌ ఫారం తప్పనిసరి గా దగ్గర ఉంచుకోవాలి.

- అలాగే కన్సల్టేషన్‌ బిల్లు, అడ్మిషన్‌ సిఫార్సు, డిశ్చార్జి రసీదు, ఆస్పత్రి .. ఫార్మసీ ఒరిజినల్‌ బిల్లులు ఉండటం శ్రేయస్కరం.

చదవండి: ఎక్సైడ్‌ లైఫ్‌ స్మార్ట్‌ ఇన్‌కం ప్లాన్‌

మరిన్ని వార్తలు