తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి

22 Jun, 2021 14:00 IST|Sakshi

రవి (పేరు మార్చం) కాలేజీ విద్యార్ధి. క్లాస్‌లో ఫస్ట్‌. ఇలాంటి విద్యార్ధి సడన్‌ గా కాలేజీకి వెళ్లకుండా, చదువులో వెనకబడిపోయాడు. తల్లిదండ్రుల్ని కేర్‌ చేయడం లేదు. దురలవాట్లకు అలవాటు పడ్డాడు. 24 గంటలు ఫోన్‌లోనే గడిపేవాడు. దీంతో కొడుకు రవి భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన స్నేహితుల్ని, కాలేజీలో ఆరా తీశారు. కానీ కొడుకు గురించి ఎవరు నెగిటీవ్‌గా చెప్పలేదు. పైగా మంచోడు. బాగా చదువుతాడంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. అప్పుడే తల‍్లిదండ్రులకు కొడుకు రవి ఫోన్‌ను చెక్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఓ రోజు మరిచిపోయి రవి తన ఆండ్రాఫోన్‌ను ఇంట్లో పెట్టి వెళ్లగా అతని ఫోన్‌ను చెక్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్‌ లాక్‌ ఉండడంతో తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేయించాడు రవి తండ్రి. ఫోన్‌లాక్‌ తో రవి ఇలా తయారవ్వడానికి కారణం ప్రేమేనని తేలింది. కొడుకు ప్రేమించిన అమ్మాయికి పెళ్లైపోయిందని, అది తట్టుకోలేక రవి మనోవేధనకు గురైనట్లు అతని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం కొడుక్కి కౌన్సెలింగ్‌ ఇప్పించి మామూలు మనిషిని చేశారు. 

ఇలాంటి ఘటనలు ఒక్క రవి ఇంట్లోనే కాదు..అందరి ఇళ్లల్లో సాధారణం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే టీనేజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఫోన్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ, వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం..లాక్‌ ఉన్నా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ల ఫోన్‌ లో ఉన్న డేటాను చూడొచ్చు.   

అన్నీ ఆండ్రాయిడ్‌ ఫోన్లకు లాక్‌  అంటే పాస్వర్డ్, ప్యాట్రాన్‌ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఫోన్లో ఉండే అప్లికేషన్లకు కూడా లాక్ వేస్తారు. ముఖ్యంగా గ్యాలరీలోని ఫోటోలకు.  ఇలా ఉండే వారి ఫోన్లో ఫోటోలు, ఇతర డేటాను మనం చూడొచ్చు. దీనికి ఒక చిట్కా ఉంది.ప్రతి ఆండ్రాయిడ్ ఫోనలలో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. కాబట్టి గ్యాలరీ లాక్ ఉన్న ఫోన్‌ లో క్రోమ్ ఓపెన్ చేసి,URL స్థానం లో file:///sdcard/ అని టైపు చేస్తే సరి. ఆ సంబంధిత ఫోన్లో ఉన్న ఎస్‌డీ లోని ఫోటోలన్నీ బ్రౌజర్ ద్వారా చూసేయొచ్చు. ఇందులో డీసీఐఎంను ఓపెన్‌ చేయోచ్చు. 

చదవండి : Phone Hacking : మీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా? గుర్తించండిలా?!

మరిన్ని వార్తలు