మీ ఆండ్రాయిడ్, యాపిల్‌ ఫోన్ పోయిందా? ఇదిగో ఇలా చేయండి

8 Oct, 2021 20:38 IST|Sakshi

ఎన్నైనా చెప్పండి.. కొత్త వస్తువు కొన్న రోజు క్లౌడ్‌9లో దర్జాగా సింహాసనం వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏ సమస్య లేనట్లుగా ఉంటుంది. ఎన్నైనా చెప్పండీ.. ప్రేమతో కొన్న వస్తువును పోగొట్టుకున్న రోజు.. సింహాసనం నుంచి ఎవరో పాతాళంలోకి తోసినట్లుగా ఉంటుంది. విధి విలన్‌గా మారి అదేపనిగా వికటాట్టహాసం చేస్తున్నట్లుగా ఉంటుంది. మరేం ఫరవాలేదు మిత్రమా.. పోయిన మీ గ్యాడ్జెట్స్‌ జాడ కనిపెట్టడానికి అదుగో.. అవి రెడీగా ఉన్నాయి, అవేమిటో తెలుసుకుందాం..

‘ఎప్పుడూ ఇంత ఖరీదైన వస్తువు కొని ఎరగను. ఇప్పుడు యాపిల్‌ వాచ్‌ కొన్నాను. కొని వారం కూడా కాలేదు. పోగొట్టుకున్నాను. నా మతిమరుపుతో ఛస్తున్నాననుకో’ కిలోమీటరు పొడవునా నిట్టుర్చాడు రమేష్‌. ‘ఫైండ్‌ మై ఫీచర్‌ యూజ్‌ చేయలేదా?’ అని అడిగాడు సురేష్‌. కేవలం యాపిల్‌ వాచ్‌ మాత్రమే కాదు.. ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్‌ టచ్‌.. యాపిల్‌ యూజర్లు తాము కోల్పోయిన డివైజ్, పర్సనల్‌ ఐటమ్స్‌ ను ‘ఫైండ్‌ మై’ యాప్‌తో  కనుగొనవచ్చు.(చదవండి: ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‎బ్యాక్!)

యాపిల్‌ పరికరం అయితే ఇలా చేయండి

  • వ్యూ లొకేషన్‌ 
  • ప్లే ఏ సౌండ్‌
  • మార్క్‌ యాజ్‌ లాస్ట్‌ (లాస్ట్‌ మోడ్‌) 
  • రిమోట్‌ ఎరాజ్‌
  • నోటిఫై వెన్‌ ఫౌండ్‌ 
  • నోటిఫై వెన్‌ లెఫ్ట్‌ బిహైండ్‌

ఇక గూగుల్‌ దగ్గరకు వద్దాం..
యాపిల్‌ ఎయిర్‌ట్యాగ్‌ లాంటి డివైజ్‌ ట్రాకర్స్‌ గూగుల్‌లో లేనప్పటికీ ‘ఫైండ్‌ మై డివైజ్‌’ పోర్టల్‌ లేదా ‘ఫైండ్‌ మై డివైజ్‌’ యాప్‌తో మిస్‌ అయిన డివైజ్‌ల ‘లొకేషన్‌’ను ట్రాక్‌ చేయవచ్చు. రింగ్, రికవర్‌ ఆప్షన్‌ల విషయానికి వస్తే.. ‘రింగ్‌’తో సైలెంట్‌లో ఉంటే రింగ్‌ చేయవచ్చు. ‘రికవర్‌’తో లాకింగ్‌ చేయవచ్చు. ‘ఫైండ్‌ మై డివైజ్‌’తో గూగుల్‌ ఎకౌంట్‌తో లింకైన పిక్సెల్‌ బడ్స్, ఇయర్‌ బడ్స్, వోఎస్‌ స్మార్ట్‌వాచ్‌లను కూడా ట్రాక్‌ చేయవచ్చు. పోయిన గ్యాడ్జెట్స్‌ ఆచూకీ తెలుసుకోవడానికి శాంసంగ్‌లో స్మార్ట్‌ట్యాగ్‌(బ్లూటూత్‌), స్మార్ట్‌ట్యాగ్‌ ప్లస్‌ (బ్లూటూత్‌ అండ్‌ ఆల్ట్రావైడ్‌బాండ్‌)లు ఉన్నాయి.(చదవండి: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్‌)

యాపిల్, గూగుల్, శాంసంగ్‌తో సంబంధం లేకుండా ఎన్నో కంపెనీలు ట్రాకింగ్‌ యాప్‌ల వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘టైల్‌’  ఈ యాప్‌లో సైజ్, సామర్థ్యాలను బట్టీ రకరకాల ట్రాకర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఉదా: ప్రో-పవర్‌ఫుల్‌ ట్రాకర్, మెట్‌-వర్స్‌టైల్, స్లిమ్‌-థిన్‌ ట్రాకర్‌ దూరంలో ఉన్నాసరే, దగ్గర్లో ఉన్నా సరే, ‘ఫైండ్‌ యువర్‌ థింగ్స్‌-ఫైండ్‌ యువర్‌ ఫోన్‌’ అని పిలుపునిస్తుంది టైల్‌.  యూజర్‌ ప్రైవసీ, సెక్యూరిటీలకు భంగం కలిగించమనీ, డాటాను మార్కెట్‌ అవసరాల కోసం ఉపయోగించమని చెబుతుంది టైల్‌. ‘పోగొట్టుకున్న చోటే వెదకాలి’ అంటారు. ‘ఎక్కడ పోగొట్టుకున్నానో నాకెలా తెలుస్తుంది!’ అనే ధర్మసందేహాన్ని తీర్చడానికి డిజిటల్‌ ప్రపంచంలో ఎన్నో ఫీచర్స్, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిచయం చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని వార్తలు