‘ఇది అలాంటిలాంటి తలదిండు కాదు, హైటెక్‌ తలదిండు’!

18 Sep, 2022 07:10 IST|Sakshi

ఇది అలాంటిలాంటి తలదిండు కాదు, హైటెక్‌ తలదిండు. అమెరికన్‌ బహుళజాతి సంస్థ ‘పిల్లోక్యూబ్‌’ ఈ అధునాతన తలదిండును ‘డ్రీమ్‌ మెషిన్‌’ పేరిట రూపొందించింది. ఘనాకారంలో ఉండే ఈ తలదిండులోని సెన్సర్లు, దీనిపై తలపెట్టి నిద్రించేవారు ఏ పరిస్థితుల్లో సౌకర్యవంతంగా ఉంటారో గుర్తించి, తగిన రీతిలో గది వాతావరణాన్ని మార్చేస్తాయి. 

ఇవి పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. ‘డ్రీమ్‌ మెషిన్‌’లోని సెన్సర్లు గదిలోని ఉష్ణోగ్రతను, గాలిని వినియోగదారునికి సౌకర్యవంతంగా ఉండేలా నియంత్రిస్తాయి. గదిలోని అనవసరపు ధ్వనులను చెవులకు సోకకుండా చేస్తాయి. దీనిపై తలవాల్చి పడుకుంటే, ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇట్టే నిద్రలోకి జారుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 129.99 డాలర్లు (రూ.10,389) మాత్రమే!

మరిన్ని వార్తలు