మీరు పీఎఫ్‌ ఖాతాదారులా? యూఏఎన్‌ నెంబరు ఎలా పొందాలో తెలుసా?

7 Aug, 2022 09:50 IST|Sakshi

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్‌లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్‌ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను  క్రియేట్‌ చేసుకోవచ్చు.

యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఒక సంస్థ నుండి మరొక సంస్థకు ఉద్యోగం మారినపుడు,  ఆ ఉద్యోగి ఐడీ నంబరు మారినట్టుగా  యూఏఎన్  మారదు.  అందుకే అది యూనివర్సల్‌  అయింది. ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంస్థలో చేరిన సమయంలో ఉద్యోగి తప్పనిసరిగా  యజమానికి తమ యూఏఎన్ నంబరును అందించాలి. అపుడు ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అలాగే  ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్‌ఏ నెంబర్‌తో కేవైసీ లింక్‌ చేయాల్సి ఉంటుంది. 

యూఏఎన్‌తో  మాత్రమే ఈపీఎఫ్‌వో సభ్యుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మేనేజ్‌మెంట్‌ సులువవుతుంది. ముఖ్యంగా బ్యాలెన్స్‌ చెక్‌, లోన్ దరఖాస్తులను సమర్పించడం లాంటివి. దీనికి ఎలాంటి భౌతిక పత్రాలు అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఉప సంహరణ అభ్యర్థనను ఈజీగా చేసుకోవచ్చు. అయిత మొదటిసారి EPFO సైన్ అప్ చేస్తున్నప్పుడు ఐడీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌, బ్యాంక్ అకౌంట్‌  వివరాలు, ప్యాన్‌, ఆధార్‌తోపాటు,  ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కార్డ్‌ను నమోదు  చేయాలి.

ఆన్‌లైన్‌లో యూఏఎన్‌ ఎలా పొందవచ్చు.
• ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో మెంబర్ ఇ-సేవాకు లాగిన్  అవ్వాలి
• ముఖ్యమైన లింక్ విభాగంలో అందుబాటులో ఉన్న “UANని యాక్టివేట్ చేయండి” ఆప్షన్‌పై క్లిక్ చేయండి
• ఆధార్  ఆప్షన్‌ ఎంచుకుని, తదుపరి సూచలన మేరకు అవసరమైన వివరాలు నమోదు చేయండి
• గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ పై క్లిక్ చేయండి.. ఇక్కడ మనం నమోదు చేసిన వివరాలను క్రాస్‌ చెక్‌     చేసుకునే అవకాశం కూడా ఉంటుంది
•  కొనసాగించడానికి అంగీకరించు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి
•  మీ అభ్యర్థనను ధృవీకరించడానికి మీ మొబైల్‌ల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్‌  చేయండి
• UANని యాక్టివేట్ చేయండిపై క్లిక్ చేయండి.
• ఈ ప్రాసెస్‌ అంతా పూర్తి అయిన తరువాత మీ  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు  యూఏఎన్‌ నంబర్, పాస్‌వర్డ్‌ మెసేజ్‌ వస్తుంది. 

మరిన్ని వార్తలు