ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌!

9 Mar, 2021 18:06 IST|Sakshi

ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు విలీనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లు కలిగిన కొత్త చెక్ పుస్తకాలను పొందవలసి ఉంటుందని యుబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్) లావాదేవీల సమయంలో బ్యాంక్ శాఖను గుర్తించడానికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్(ఐఎఫ్‌ఎస్‌సీ) కోడ్ ఉపయోగిస్తారు. అలాగే, చెక్ ప్రాసెసింగ్ కోసం మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఎంఐసీఆర్) కోడ్ ను ఉపయోగిస్తారు.

పాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖల ఐఎఫ్‌ఎస్‌సి, ఎంఐసీఆర్ కోడ్ లు గల చెక్‌ బుక్స్ 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. పాత బ్యాంక్ వినియోగదారులు తమ బ్రాంచ్ నుంచి కొత్త చెక్ బుక్ పొందాలని లేదా మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యుబిఐ బ్యాంకు కోరింది. అయితే, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూజర్లు యూనియన్‌ బ్యాంకుకు మారినా పాత అకౌంట్‌ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్‌ నెంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్‌ ఐడీ కూడా పాతదే ఉంటుంది. కోత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్‌ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110కు సంప్రదించవచ్చు.

చదవండి:

ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా!

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు