గూగుల్ సెట్టింగ్స్‌లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!

8 Feb, 2022 20:56 IST|Sakshi

గూగుల్‌ అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది జీమెయిల్‌, వెబ్‌ బ్రౌజింగ్‌ ఇవేకాకుండా డ్రైవ్‌ స్టోరేజ్‌, వీడియో కాలింగ్‌, మెసేజింగ్‌, మ్యాప్స్‌, ఫొటోస్‌, క్యాలెండర్‌, కాంటాక్ట్స్‌, యూట్యూబ్‌, షాపింగ్‌, న్యూస్‌ ఇలా ఎన్నో రకాల సేవలను గూగుల్‌ అందిస్తోంది. అయితే, ఈ సేవలన్నీ అందించడానికి మనం కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఇచ్చే పేరు, ప్రొఫైల్‌ ఫొటో, మెయిల్‌ ఐడీ, పుట్టిన తేది, జెడర్‌,ఉద్యోగం, నివసించే ప్రాంతం వంటి వివరాలు ఇతర యూజర్లకు కనిపించే అవకాశం ఉంది. 

అయితే, ఇప్పుడు మనం మన వ్యక్తి గత వివరాలను ఇతరులకు కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ మీ సమాచారం కనిపించదు. మీ వివరాలను ఇతరులు చూడకుండా ఉండటానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మొదట పీసీ/కంప్యూటర్‌లో గూగుల్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్ చేయాలి
  • ఇప్పుడు దానిపై క్లిక్‌ చేస్తే మేనేజ్‌ యవర్‌ గూగుల్‌ అకౌంట్‌ అనే అప్షన్‌ ఉంటుంది.
       
  • ఆ ఆప్షన్ ఓపెన్‌ చేస్తే గూగుల్‌ ఖాతా పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. 
  • అందులో పర్సనల్‌ మీ ఇన్ఫో సెక్షన్‌పై క్లిక్‌ చేస్తే చూజ్‌ వాట్‌ అథర్స్‌ సీ అనే ఆప్షన్ ఓపెన్‌ చేయాలి.
  • అందులో అబౌట్‌ మీ లపై క్లిక్‌ చేస్తే యాడ్‌(Add), ఎడిట్‌, రిమూవ్‌ అనే ఆప్షన్లు ఉంటాయి. 
  • మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా సమాచారం అదనంగా చేర్చాలన్నా, ఉన్నది తొలగించాలన్నా, పేరులో మార్పులు చేయాలన్నా వాటిపై క్లిక్‌ చేసి మారిస్తే సరిపోతుంది.
  • మీ సమాచారం ఎవరికి కనబడకూడదు అనుకుంటే Only Me అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

(చదవండి: బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!) 

మరిన్ని వార్తలు