నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?

5 Sep, 2021 15:34 IST|Sakshi

ప్రస్తుతం కరోనా మహమ్మరిని ఎదుర్కొనే ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఒక వ్యాక్సిన్ మాత్రమే. అయితే, కొందరు నెరగాళ్లు ఈ వ్యాక్సిన్లను కూడా విడిచి పెట్టడం లేదు. వ్యాక్సిన్లకు నకిలీ వ్యాక్సిన్లను సృష్టించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ నకిలీ వల్ల ప్రజలు భారీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే, వీటి కట్టడి దిశగా కేంద్ర రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) కూడా ఆందోళన చెందుతుంది. (చదవండి: Google: వెతుకులాట.. అలా మొదలైంది)

ఇటీవల, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలలో ఆస్ట్రాజెనెకా/ఆక్స్ ఫర్డ్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల డూప్లికేట్ వెర్షన్లను కనుగొన్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. అందుకే, ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతానికి, భారతీయ మార్కెట్లో కరోనా వైరస్ అరికట్టడం కోసం దేశంలో మూడు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్లు ఒరిజినల్ లేదా నకిలీదా అని చెక్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. 

కోవిషీల్డ్

  • కోవిషీల్డ్ బాటిల్ ఈ క్రింది వివరాలు ఉండాలి
  • ఎస్ఐఐ ప్రొడక్ట్ లేబుల్
  • ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు(కోవిషీల్డ్) ఉండాలి
  • జనరిక్ పేరు ఫాంట్ అన్ బోల్డ్ గా ఉంటుంది
  • "(రీకాంబినెంట్)" అదే ఫాంట్ తో జనరిక్ పేరు దిగువ ఉంటుంది.
  • సీజీఎస్ సేల్ స్టాంప్ కొరకు కాదు. 
  • ఎస్ఐఐ లోగో కచ్చితంగా ఉండాలి. 
  • లేబుల్ కలర్ షేడ్ ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ అనేది ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది.

కొవాక్సిన్

  • బుడ్డి లేబుల్ మీద డీఎన్ఎ వంటి నిర్మాణం ఉంటుంది. 
  • కోవాక్సిన్ స్పెల్లింగ్ "ఎక్స్"లో గ్రీన్ కలర్ ఉంటుంది. 
  • కొవాక్సిన్ స్పెల్లింగ్ పై హోలో గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది. 

భారతదేశంలో ఇప్పటి వరకు 68 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇందులో 18-44 ఏళ్ల వయసున్న వ్యక్తులకు 26.99 కోట్ల ఫస్ట్ డోస్, మే 1న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫేజ్-3 ప్రారంభమైనప్పటి నుంచి వారికి 3.35 కోట్ల రెండో డోసులుఇచ్చారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 60 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది.

మరిన్ని వార్తలు