క్రెడిట్‌ కార్డ్‌ వినియోగిస‍్తున్నారా? మీ సిబిల్‌ స్కోర్‌ పెరగాలంటే..

12 Sep, 2021 16:21 IST|Sakshi

పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఎలాంటి రుణం కావాలన్నా సిబిల్‌ స్కోర్‌(క్రెడిట్‌ స్కోర్‌) చాలా అవసరం. సిబిల్‌ స్కోర్‌ బాగుంటేనే ఫైనాన్షిల్‌ క్రైసిస్‌ నుంచి బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు ఆదుకుంటాయి. వరల్డ్‌ బ్యాంక్‌ డేటా ప్రకారం..వరల్డ్‌ వైడ్‌ గా 190 మిలియన్ల మంది రుణాల్ని తీసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు తేలింది. అయితే ఆర్ధిక వ్యవహారాల్లో కీరోల్‌ ప్లే చేసే సిబిల్‌ స్కోర్‌ను పెంచుకునే మార్గాలు అనేకం ఉన్నా..వాటిలో ఉద్యోగస్తులు సిబిల్‌ స‍్కోర్‌ను పెంచేందుకు ప్రత్యేక పద్దతులు ఉన్నాయి.    

లోన్‌ తీసుకోవాలంటే సిబిల్‌ స్కోర్‌ ఎందుకు అంత ముఖ్యం?
వన్‌ స్కోర్‌ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 'క్రెడిట్ స్కోరు అనేది 300 నుండి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మన ఆర్ధిక వ్యవహారాలు ఎలా ఉన్నాయో చెబుతోంది. లోన్‌ కోసం అప‍్లై చేసినప్పుడు.. ఆ లోన్‌ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకునే ముఖ్యమైన బెంచ్ మార్కే ఈ సిబిల్‌ స్కోర్‌. 

''సిబిల్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తాయి. అదే స్కోర్‌ తక్కువగా ఉంటే మీరు ఆర్ధికంగా ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తాయి.అందువల్ల తక్కువ వడ్డీ రేటు, క్రెడిట్ కార్డ్‌లో లిమిట్‌ ఎక్కువగా కావాలాన్ని ఈ సిబిల్‌ స్కోర్‌ చాలా అవసరమని' అనురాగ్‌ సిన్హా అన్నారు.   

ఉద్యోగస్తులు తమ సిబిల్‌ స్కోర్‌  పెంచుకోవాలంటే    
చాలా మంది తొలిసారి ఉద్యోగంలో జాయిన్‌ అయిన తర్వాత లోన్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే సిబిల్‌ స్కోర్‌ పెంచుకోవచ్చని వన్‌ స్కోర్‌ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపారు.అంతేకాదు సిబిల్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలిపారు.  

సురక్షితమైన క్రెడిట్ కార్డును పొందాలి: కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి సెక‍్యూర్‌ లేని క్రెడిట్‌ కార్డ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు లేదా ఫైనాన్స్‌ కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా క్రెడిట్‌ కార్డ్‌లను అందిస్తుంటాయి. వాటిలో సెక్యూర్‌ క్రెడిట్‌ కార్డ్‌లు 75-80 శాతం సిబిల్‌ స్కోర్‌ బాగుండేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఏ క్రెడిట్‌ కార్డ్‌ తీసుకుంటే మంచిదో ముందే తెలుసుకోవాలి.  

సకాలంలో  ఈఎంఐ చెల్లించడం : లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవలను (ECS) సెట్ చేయడం ద్వారా మీ EMI,లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌లు చేసుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు అనేక కారణాల వల్ల మొత్తం ఈఎంఐని చెల్లించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో చెల్లింపును కోల్పోకుండా డిఫాల్ట్‌ని నివారించడానికి మీరు కనీసం మొత్తాన్ని చెల్లించాలి. 

ఎక్కువ సార్లు లోన్‌ కోసం అప్లయ్‌ చేయడం : సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య‌. ఇది 300 నుంచి 900 వర‌కు ఉంటుంది. మీరు ఎక్కువ సార్లు లోన్‌ కోసం అప్లయ్‌ చేస్తే దాని ప్రభావం సిబిల్‌ స్కోర్‌ పై పడుతుంది. సిబిల్‌ స్కోర్‌ పూర్తిగా తగ్గిపోతుంది.   

సిబిల్‌ స్కోర్‌ లేకుండా రుణం పొందవచ్చా? 
తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడానికి ఎక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉండటం మంచిది. సిబిల్‌ స్కోర్‌ స్కోరు లేనప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ట్రాన్సాక్షన్లు ఆధారంగా బ్యాంకులు మీరు ఆర్ధికంగా ఎలా ఉన్నారనే విషయాన్ని అంచనా వేస్తాయి. కాబట్టి సిబిల్‌ స్కోర్‌ ఎక్కువగా ఉండటమే మంచిది  

సురక్షిత రుణాల రకాలు:

- మాటిగేజ్‌ లోన్‌ లేదా ప్రాపర్టీ లోన్‌  
- కారు లోన్‌
- హౌజ్‌లోన్‌  
- ఏదైనా బిజినెస్‌ లోన్‌ (యంత్రాలు/ముడి పదార్థాలు/భవనాలు)
- ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం

సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు:

ఆలస్యంగా చెల్లించడం: ఒకటి లేదా రెండు ఆలస్యమైన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆలస్యంగా  లోన్‌ పే చేయడం వల్ల  మీ క్రెడిట్ కార్డ్‌, సిబిల్‌ స్కోర్‌ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.    

క్రమపద్దతిలో చెల్లించకపోవడం: ఉదాహరణకు తీసుకున్న లోన్‌ ఈఎంఐ కొన్నిసార్లు చెల్లించాల్సిన మొత్తంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంటాం. అలా పే చేయడం వల్ల సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతుంది. 

ఎక్కువ సంఖ్యలో లోన్ల కోసం అప్లయ్‌ చేయడం: సిబిల్‌ స్కోర్‌ అనుగుణంగా బ్యాంకులు రుణాల్ని ఇస్తుంటాయి. అయితే బ్యాంకులు రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తే మనం వేరే బ్యాంక్‌ ద్వారా లోన్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇలా చేయడం వల్ల సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. 

మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా చూపించడం: కొన్ని సార్లు మన సిబిల్‌ స్కోర్‌ ఎక్కువగా ఉన్నా.. మోసపూరిత కార్యకలాపాల వల్ల సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందని చూపిస్తాయి. సిబిల్‌ స్కోర్‌ ఎక్కువగా ఉందని అనిపిస్తే బ్యాంకు అధికారుల్ని సంప్రదించి సిబిల్‌ స్కోర్‌ను సరిచేయించుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో రుణాల్ని పొందే అవకాశాన్ని కోల్పోతాము.  

చదవండి: క్రెడిట్‌ స్కోర్‌ బాగున్నా, లోన్‌ ఎందుకు రిజెక్ట్‌ అవుతుందో తెలుసా?

మరిన్ని వార్తలు