మీ పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయి? తెలుసుకోండిలా

26 Jun, 2021 14:09 IST|Sakshi

ఏపీ, తెలంగాణ లలో  టెలికాం శాఖ ప్రత్యేక సేవలు

అనవసర నంబర్లు తొలగించుకునే అవకాశం

హైదరాబాద్‌: కారణాలు ఏవైనా కావొచ్చు.. మనకు తెలియకుండానే చాలా నంబర్లు తీసేసుకుంటాం. పాత నంబర్‌ని మరచిపోతుంటాం. అంతేకాదు.. మన పేరు మీద కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది పజిల్‌లా మారింది. ఈ గుట్టు విప్పేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. 

ఇలా చేయండి
మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మనం ప్రస్తుతం వాడే ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. మీ నంబరుకు ఓటిపీ వస్తుంది. దాంతో లాగిన్ అవ్వాలి. ఒక సారి సైట్‌లోకి లాగిన్‌ అవగానే మన పేరు మీద ఎన్న నంబర్లు ఉన్నాయనే విషయం డిస్‌ప్లే అవుతుంది.

అక్కడ ఇది నా నంబరు కాదు, అవసరం లేదు, అవసరం ఇలా మూడు ఆప్షన్లు ఇంగ్లీష్‌లో వస్తాయి, ఇందులో అసరం లేదు, మనకు తెలియకుండానే మన పేరు మీద రిజిస్ట్రర్‌ అయిన నంబర్లను తొలగించుకునే ఆప్షన్‌ ఉంటుంది. మనకు తెలియని ఏదైనా నంబర్ మన పేరు మీద నమోదు అయి ఉందని తెలిస్తే.  ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు  చేసిన వెంటనే టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. 

చదవండి : యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ

మరిన్ని వార్తలు