పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేసుకోండి ఇలా..?

18 Jun, 2021 14:48 IST|Sakshi

ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) శుభవార్త అందించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఎన్ నెంబర్ లింకు గడువును తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేయకపోతే వెంటనే లింకు చేసేయండి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. 

ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ తో లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఎన్) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.

ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా?
దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.

దశ 2: ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి.

దశ 3: 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి

దశ 4: మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్' మీద క్లిక్ చేయండి.

దశ 5: దీని తర్వాత, మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై చేస్తుంది.

మీ సంస్థ, యుఐడీఎఐ ద్వారా మీ కెవైసీ డాక్యుమెంట్ విజయవంతంగా ఆమోదించిన తర్వాత, ఈపీఎఫ్ ఖాతా ఆధార్ కార్డుకు లింక్ చేయబడుతుంది.

చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు