మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?

10 Jan, 2021 14:41 IST|Sakshi

వాట్సాప్ 2021లో కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై చాలా విమర్శలు వస్తున్నాయి. దింతో చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా మరింత సెక్యూరిటీ అందించే సిగ్నల్ యాప్ వైపు ఎక్కువ యూజర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం కొద్దీ రోజుల క్రితం ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ఒక మెసేజ్ ట్విటర్ లో పెట్టాడు. దింతో అప్పటి నుండి సిగ్నల్ యాప్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.(చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..?

అయితే, కొత్తగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు తమ బంధువులును, మీత్రులను ఇందులో ఎలా యాడ్ చేయాలో వారికీ అర్ధం కావడం లేదు. కానీ, యూజర్లు వాట్సాప్ తరహాలనో సులభంగా మీ మిత్రులను ఇందులోకి జోడించవచ్చు. మీ మిత్రులు కూడా సిగ్నల్ యాప్ వాడుతుంటే మీ పని ఇంకా చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూస్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు.

మరిన్ని వార్తలు