క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!

23 Dec, 2021 20:28 IST|Sakshi

ఆటో, కారు బుకింగ్‌ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తుంటారు. ఓలా, ఉబెర్ ఉపయోగించే వ్యక్తులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య ఇది. రైడ్-హైలింగ్ కంపెనీల డ్రైవర్లు డ్రాప్ లొకేషన్ గురించి అడిగిన తర్వాత వెంటనే రైడ్‌లను రద్దు చేస్తారు అని ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. ఒక నిర్ధిష్ట ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడనట్లయితే డ్రైవర్‌ను మనం నిందించలేం. అత్యవసర సమయాలలో ఇలాంటి సమస్య ఎదురైతే వినియోగదారులకు వచ్చే కోపం గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
 
క్యాబ్ వినియోగదారుల ఎక్కువగా ఎదుర్కొనే ఈ సమస్య గురుంచి ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందించారు. ఇకపై కస్టమర్‌ క్యాబ్‌ బుక్‌ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు. ఇక నుంచి లొకేషన్‌, పేమెంట్‌ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి. రైడ్‌ తనకు అంగీకారమైతే ప్రొసీడ్‌ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులపై క్యాబ్‌ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

(చదవండి: మీ మొబైల్‌తో నకిలీ పాన్-కార్డు గుర్తించండి ఇలా..?)

మరిన్ని వార్తలు