online banking tips: హ్యాకర‍్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్‌ అకౌంట్‌ సేఫ్‌

24 Oct, 2021 16:13 IST|Sakshi

కోవిడ్‌ -19 కారణంగా ఆన్‌లైన్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్‌ బ్యాంకింగ్‌లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్‌ క్రిమినల్స్‌ నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్‌ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్‌ అటాక్స్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్‌ దాడులకు గురవుతున్నారు. 

సైబర్‌ నేరస్తులు దాడులు చేసే విధానం 

అయితే ఇలాంటి సైబర్‌ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్‌  దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా  కొన్ని టిప్స్‌ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్‌ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. 

ముందస్తుగా సైబర్‌ నేరస్తులు బాధితుల బ్యాంక్‌ అకౌంట్‌లు, యూజర్‌ నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌, ఓటీపీలను దొంగిలిస‍్తారు. 

వాటి సాయంతో సేమ్‌ అఫిషియల్‌ బ్యాంక్‌ ఈమెల్‌ తరహాలో బ్యాంక్‌ హోల్డర్లకు జీమెయిల్‌ నుంచి ఈమెయిల్‌ సెండ్‌ చేస్తారు. 

బ్యాంక్‌ నుంచి వచ్చిన ఈమెయిల్స్‌ ఎలా స్పామ్‌ ఫోల్డర్‌లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్‌ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. 

ఆ మెయిల్స్‌లో ఓ లింక్‌ క్లిక్‌ చేయాలని సూచిస్తారు.  

ఆ లింక్‌ క్లిక్‌ చేసి అందులో యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయమని అడుగుతారు.  

ఇలా చేయడానికి రివార్డ్‌ పాయింట్లను ఎరగా వేస్తారు.  

 సైబర్‌ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే 
 
ముందుగా మీ ఈ మెయిల్‌ లోని వెబ్‌సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు.

https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది.

నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్‌ చేసే మెయిల్స్‌ ఇలా ఉంటాయి.  

మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్‌ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు

ఏవైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు.

ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి.  

చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్‌లు,పాస్‌వర్డ్‌లు మీ రహస్యం.మేం బ్యాంక్‌ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్‌ను, సూచనల్ని పాటించి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండండి.

మరిన్ని వార్తలు