సింపుల్‌, డిలీటైన వాట్సాప్‌ డేటాను ఇలా బ్యాకప్‌ తీసుకోండి

21 Nov, 2021 11:43 IST|Sakshi

వాట్సాప్‌ చాట్‌ డిలీట్‌ అయ్యిందా? లేదంటే పొరపాటున డిలీట్‌ చేశారా? మరేం పర్లేదు. సింపుల్‌ టెక్నిక్‌తో మీ ఫోన్‌లో డిలీట్‌ అయిన వాట్సాప్‌ చాట్‌ను రీస్టోర్‌ చేసుకోవచ్చు. అదెలా అంటే..!

వాట్సాప్‌ పరిచయం అక్కర్లేని పేరు. ఫేస్‌బుక్‌ కు చెందిన ఈ వాట్సాప్‌ యాప్‌లో వరల్డ్‌ వైడ్‌గా ఉన్న యూజర్లు ప్రతి రోజు ఇమేజెస్‌, ఆడియా, వీడియోలు, జిఫ్‌ ఇమేజ్‌లు యూజర్లను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిస్తుంటారు. ఆ డేటాను వాట్సాప్‌ సంస్థ తన సర్వర్‌లలో నుంచి  తొలగిస్తుంది. అయితే ఈ సింపుల్‌ హ్యాక్‌తో వాట్సాప్లో డిలీటైన డేటాను కలెక్ట్‌ చేసుకోవచ్చు.  

ముందు చాట్‌ను బ్యాకప్‌ తీసుకోవాలి

డిలీటైన డేటాను రీస్టోర్‌ చేసుకోవాలి' అంటే ముందుగా మీ వాట్సాప్‌లో వాట్సాప్‌ డేటా బ్యాకప్‌ తీసుకోవాలి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే  

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి>>సెట్టింగ్‌లోకి వెళ్లాలి>>అందులో చాట్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేసి చాట్‌ను బ్యాకప్‌ను తీసుకోవాలి.  

అనంతరం ఆ డేటాను బ్యాకప్‌ తీసుకోవాలంటే గూగుల్‌ డ్రైవ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అందులో ఫైల్‌ క్రియేట్‌ చేసుకొని బ్యాక్‌ అప్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస‍్తే మీ వాట్సాప్‌ డేటా అంతా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది.  

గూగుల్‌ డ్రైవ్‌లో మీ వాట్సాప్‌ డేటా స్టోర్‌ అవ్వాలంటే
గూగుల్‌ డ్రైవ్‌లో మీ వాట్సాప్‌ డేటా డీఫాల్ట్‌గా స్టోర్‌ అవ్వాలి అంటే మీరు ఆటోమెటిక్‌ ​ బ్యాకప్‌ ఫీచర్ ఆప్షన్‌ను ఆన్‌ చేయాల్సి ఉంటుంది. 

మీ బ్యాకప్‌ని పునరుద్ధరించడానికి 
మీరు బ్యాకప్‌ తీసుకున్న వాట్సాప్‌ డేటాను చూడాలంటే  మీ  కంప్యూటర్‌ లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లేదా ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి ఫైల్‌లను ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 

ఫైల్ మేనేజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఫైల్ మేనేజర్ యాప్‌లో, మీ లోకల్‌ స్టోరేజ్‌ లేదా ఎస్‌డీకార్డ్‌ >> వాట్సాప్‌ >> డేటాబేస్‌లోకి నావిగేట్ చేయండి. మీ డేటా ఎస్‌డీ కార్డ్‌లో స్టోరేజ్‌ కాలేదంటే బదులుగా మీరు "ఇంటర్నల్‌స్టోరేజ్‌ " లేదా "మెయిన్‌ స్టోరేజ్‌"లో చూడొచ్చు. 

చదవండి: వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త.. లేకపోతే మీ ఖాతా ఖాళీ!

మరిన్ని వార్తలు