బంపరాఫర్‌, 14 ఓటీటీలకు ఒకటే సబ్‌స్క్రిప్షన్‌..ధర ఎంతంటే

6 Oct, 2022 14:09 IST|Sakshi

ఓటీటీ లవర్స్‌కు ప్రముఖ డీటీహెచ్‌ కంపెనీ టాటా ప్లే బంపరాఫర్‌. ప్లే బింజ్‌ పేరిట 14 ఓటీటీలను అందిస్తున్నట్లు ప్రకటించింది. అన్నీ ఓటీటీలు వీక్షించాలంటే నెలకు రూ.399 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. 

ఇటీవల కాలంలో థియేటర్‌లలో విడుదలైన కొత్త సినిమాలు రోజుల వ్యవధిలో ఆయా ఓటీటీల రూపంలో స్మార్ట్‌ ఫోన్‌లలో ప్రత‍్యక్షమవుతున్నాయి. అయితే ఒక్కో సినిమా ఒక్కో ఓటీటీల్లో వస్తుండడంతో వీక్షకులకు వాటి సబ్‌ స్క్రీప్షన్‌ తీసుకోవడం తలనొప్పిగా మారింది.

ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు టాటా ప్లే ‘ప్లే బింజ్‌’ అనే స్పెషల్‌ ఆఫర్‌ను యూజర్లకు అందిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా టాటా ప్లే ప్లాట్‌ ఫామ్‌పై 14 ఓటీటీలను వీక్షించవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు రూ.59 నుంచి ప్రారంభం అవుతుండగా... టాటా బింజ్‌లో 14ఓటీటీల ధర నెలకు రూ.399 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ ఓటీటీలన్నీ వీక్షించాలంటే టాటా ప్లే బింజ్‌ ప్లస్‌, అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌ ద్వారా టీవీల‍్లో చూడొచ్చు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌, వూట్‌ సెలెక్ట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, సన్‌ నెక్ట్స్‌, హంగామా ప్లే, ఎరోస్‌ నౌ వంటి పాపులర్‌ ఓటీటీలున్నాయి.

మరిన్ని వార్తలు