డబ్బులు ఆదా చేసుకోవచ్చు: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా? అయితే ఈ సీక్రెట్‌ మీకోసమే

11 Sep, 2022 18:32 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఆ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి. అదే సమయంలో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు ప్రొడక్ట్‌ అసలు ధర ఎంతో దాచిపెట్టేస్తుంటాయి. ధరను భారీ ఎత్తున తగ్గిస్తాయి. ఈ ప్రొడక్ట్‌ అసలు ధర ఇంత ఉంది. మేం నిర్వహించే ఈ సేల్‌లో ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తే మీకు ఇంత ధరకే వస్తాయని ఊరిస్తుంటాయి. అంతే ఆ ప్రకటనతో కొనుగోలు దారులు ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. తీరా సదరు ఈకామర్స్‌ వెబ్‌సైట్‌లో ఆ ప్రొడక్ట్‌ కొనుగోలు ప్రాసెస్‌ పూర్తి చేసి పేమెంట్‌ చేసే సమయానికి అసలు ధర కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో యూజర్లు ఆ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసి జేబుకి చిల్లు పెట్టుకుంటుంటారు. అందుకే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది.  

ఫెస్టివల్‌ సీజన్‌లో ఈకామర్స్‌ సంస్థలు నిర్వహించే సేల్‌లో ఉదాహారణకు ఓ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.45వేలు ఉంటే.. ఆ ఫోన్‌ను రూ.30వేలకే సొంతం చేసుకోవచ్చని ఆఫర్‌ ప్రకటిస్తాయి. కానీ కస్టమర్ల నుంచి వసూలు చేసే వాస్తవ ధరకు సదరు ఈకామర్స్‌ వెబ్‌ సైట్‌లో చూపించే అసలు ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి ప్రత్యేక సేల్‌ జరిగే సమయాల్లో మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్ట్‌ అసలు ధర ఎంతో తెలుసుకుంటే డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. 

ముందుగా 
డెస్క్‌ టాప్‌లో గూగుల్‌ క్రోమ్‌, మోజిల్లా ఫైర్‌ ఫాక్స్‌ బ్రౌజర్‌ను వినియోగిస్తుంటే బ్రౌజర్‌ ఎక్స్‌ టెన్షన్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యూజర్లు క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ్‌ కీపా (keepa)ఎక్స్‌టెన్షన్‌ను సెర్చ్‌ చేసి.. ఆ క్రోమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆ తర్వాత క్రోమ్‌, మోజిల్లాలో యాడ్‌ చేసుకోవాలి. అనంతరం అదే ఎక్స్‌టెన్షన్‌ ఓపెన్‌ చేసి.. మీరు ఏ ఈకామర్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ సైట్‌ను ఓపెన్‌ చేసి ప్రొడక్ట్‌ను ఎంటర్‌ చేస్తే మీకు చూపించే ప్రొడక్ట్‌ అసలు ధర గ్రాఫ్‌ రూపంలో మనకు కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు