మీ ఫోన్‌ పాస్‌వర్డ్‌ మరిచిపోయారా..! ఇలా చేయండి..

18 Jul, 2021 20:01 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ మన నిత్య జీవితంలో ఒక భాగమైంది. మన ప్రైవసీ కోసం మొబైల్‌ ఫోన్ల​కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుంటాం. పాస్‌వర్డ్‌ ఏర్పాటుతో మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవరి కంటపడకుండా కాపాడుకోవచ్చును. కాగా దురదృష్టవశాత్తు ఫోన్‌ పాస్‌వర్డ్‌ మరిచిపోయారు..అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే...! ఏముంది వెంటనే దగ్గరలో ఉన్న మొబైల్‌ రిపేర్‌ సెంటర్లకు తీసుకొని వెళ్తాం..ఫోన్‌ అన్‌లాక్‌ చేయించుకుంటాం! రిపేర్‌ షాపు వాడు అడిగే  డబ్బును చెల్లిస్తామంటారా..!  మీరు మొబైల్‌ రిపేర్‌ షాపుకు వెళ్లకుండా మీ ఇంట్లోనే ఫోన్‌ ఆన్‌లాక్‌ చేయడం ఎలానో మీకు తెలుసా.. ఐతే ఇది మీకోసమే..మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ విషయంలో ఫ్యాక్టరీ రిసెట్‌ చేయడంతో మీ మొబైల్‌ను అన్‌లాక్‌ చేయవచ్చును. దాంతో పాటుగా గూగుల్‌ డివైజ్‌ మెనేజర్‌ను ఉపయోగించి ఫోన్‌ను రిసేట్‌ చేయవచ్చును. 

మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఇలా ఫ్యాక్టరీ రిసేట్‌ చేయండి...

  • స్టెప్‌ 1: మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, కనీసం ఒక నిమిషం వేచి ఉండండి
  • స్టెప్‌ 2: పవర్ బటన్,  వాల్యూమ్ డౌన్ బటన్‌ను ఒకేసారి కలిసి ప్రెస్‌ చేయండి.

  • స్టెప్‌ 3: పవర్‌ బటన్‌, వాల్యూమ్‌ డౌన్‌ బటన్‌ ఒకేసారి ప్రెస్‌ చేయడంతో మీ ఫోన్‌ రికవరీ మోడ్‌లోకి వెళ్తుంది. అందులో మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో వైప్‌ డేటా/ ఫ్యాక్టరీ రిసేట్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయండి. మీ మొబైల్‌ ఫ్యాక్టరీ రిసేట్‌ అవుతున్న ఆండ్రాయిడ్‌ సింబల్‌ కనిపిస్తోంది. 

  • స్టెప్‌ 4: మొబైల్‌ ఫ్యాక్టరీ రిసేట్‌ అయ్యేంత వరకు వేచి ఉండండి. రిసేట్‌ పూర్తి అయ్యాక తిరిగి మీ ఫోన్‌ను స్విచ్‌ ఆన్‌ చేయండి.

మీరు స్విచ్‌ ఆన్‌ చేయగానే మీరు కొన్నప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌ ఎలా ఉండేదో అలా తిరిగి మీకు కనిపిస్తోంది. ఫోన్‌ ఆన్‌ అవ్వగానే భాషను సెలక్ట్‌ చేసుకోండి అనే ఆప్షను వస్తోంది. దాని తరువాత మీ ఈమెయిల్‌తో లాగిన్‌ అవ్వమని అడుగుతోంది. ఇప్పుడు మీ ఫోన్‌ను పాస్‌వర్డ్ లేకుండానే మీ యాక్సెస్ చేయగలరు.

గూగుల్‌ డివైజ్‌ మేనేజర్‌ ఉపయోగించి ఇలా ఆన్‌లాక్‌ చేయండి...

  • స్టెప్‌ 1: Visit: google.com/android/devicemanager వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • స్టెప్‌ 2: మీ గూగుల్‌ ఖాతాతో  సైన్ ఇన్ చేయండి
  • స్టెప్‌ 3: అందులో మీ గూగుల్‌ ఖాతాతో రిజస్టర్‌ ఐనా గ్యాడ్జెట్లు కనిపిస్తాయి. అందులో మీరు అన్‌లాక్ చేయదలిచిన ఫోన్‌ను ఎంచుకోండి
  • స్టెప్‌ 4:  ఎంచుకున్న ఫోన్‌లో ఎరేస్‌ డేటాపై క్లిక్‌ చేయండి. తిరిగి మీ ఈ-మెయిల్‌, పాస్‌వర్డ్‌ను అడుగుతోంది. ఎంటర్‌ చేశాక మీ ఫోన్‌ పాస్‌వర్డ్‌ ఆన్‌లాక్‌ చేయవచ్చును.

మీ డేటా పూర్తిగా ఏరేస్‌ అవుతుందన్ని బాధపడకండి. తిరిగి మీ ఈ-మెయిల్‌తో  మొబైల్‌ ఫోన్‌లో లాగిన్‌ ఐతే మీ డేటాను తిరిగి బ్యాకప్‌ చేసుకోవచ్చును. 

మరిన్ని వార్తలు