జూమ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌, ఫిల్టర్‌ ఫీచర్‌ గురించి మీకు తెలుసా?

29 Jul, 2021 14:58 IST|Sakshi

వార్‌ రూమ్‌ తరహాలో సీరియస్‌గా సాగే జూమ్‌ మీటింగ్స్‌ ఇకపై ఈ స్నాప్‌ కెమెరా ఆప్షన్‌ తో మరింత ఎంటర్‌ టైన్మెంట్‌గా మారనున్నాయి. కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి ఆఫీస్‌ మీటింగ్స్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్‌ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో  ఆన్‌లైన్‌ మీటింగ్స్‌ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప‍్రయత్నిస్తున్నాయి.

తాజాగా వీడియో కమ్యూనికేషన్‌ 'జూమ్‌'లో స్నాప్‌ చాట్‌ కు చెందిన స్నాప్‌ కెమెరా ఫిల్టర్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి ఆన్‌ లైన్‌లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్‌ జనరేట్‌ చేసుకోవచ్చు. జూమ్‌ మీటింగ్‌లో ఫిల్టర్‌ ఫీచర్‌ను వినియోగించి మన ఫేస్‌ కంప్లీట్‌గా  జనరిక్‌ ఫిక్సార్‌, డ్రీమ్‌ వర్క్స్‌ కార్టూన్‌ క్యారక్టర్‌ లోకి  ట్రాన్స్‌ ఫామ్‌ అయ్యేలా ఎనేబుల్‌ చేసుకోవచ్చు.  

ఈ ఆప్షన్‌ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్‌ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్‌జెడ్‌, ఎఎమ్‌డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్‌జెడ్‌, ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్‌డి రేడియన్ హెచ్‌డి 6450 ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్‌ ఫిల్టర్‌ కావాలనుకుంటే అఫీషియల్‌ వెబ్‌ సైట్‌ స్నాప్‌ ఐఎన్‌సీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 
ఆప్షన్‌ ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలి

జూమ్‌ ఓపెన్‌ చేసిన తరువాత రైట్‌ సైడ్‌ కార్నర్‌లో వీడియో గేర్‌ ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి.

క‍్లిక్‌ చేస్తే డ్రాప్‌ డౌన్‌ మెనూ బార్‌ లో వీడియో క్లిక్‌ చేస‍్తే కెమెరా ఆన్‌ అవుతుంది 

కెమెరా ఆన్‌ చేస్తే స్నాప్‌ కెమెరా ఆప్షన్‌ కనిపిస్తుంది. 

ఆ స్నాప్‌ కెమెరా ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్‌ కార‍్టూన్‌ కేరక్టర్‌లోకి ట్రాన్స్‌ ఫార్మ్‌ అవుతుంది. 

మరిన్ని వార్తలు