ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ టీ20 లీగ్ ఐపీఎల్- 15వ ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్ లేదా డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానుల కోసం పలు దిగ్గజ టెలికాం సంస్థలు జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సరికొత్త బండిల్ రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటితో ఐపీఎల్-2022 మ్యాచ్‌లను ఉచితంగా చూడడమే కాకుండా ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తోంది. టెలికాం సంస్థలే కాకుండా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలు కూడా పలు ఆఫర్లను అందిస్తున్నాయి.
ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను జియో అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్
ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను వోడాఫోన్ ఐడియా అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్
ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను ఎయిర్టెల్ అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్
► డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ స్లైస్ అందిస్తోంది. ఇది కేవలం స్లైస్ స్పార్క్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది.
► టైమ్స్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. టైమ్స్ ప్రైమ్ తన కొత్త కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 1,199 చెల్లించడంతో కస్టమర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్కి ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.
► హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు GyFTR వెబ్‌సైట్‌ని ఉపయోగించి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని ప్రత్యేక తగ్గింపు రేటుతో కొనుగోలు చేయవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొనుగోలుపై ఫ్లాట్ 15 శాతం తగ్గింపును అందిస్తోంది.
► ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో తరచుగా ఆన్లైన్ షాపింగ్ చేసేవారైతే, మీ కొనుగోళ్లకు రివార్డ్‌లుగా సూపర్కాయిన్స్ను అందిస్తోంది. ఈ SuperCoins తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందడానికి రీడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 299 Flipkart SuperCoinsతో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.
చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..!