చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!

17 Jan, 2022 17:44 IST|Sakshi

దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్‌లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్‌ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది.  

కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్‌ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. 

మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ మొదలుకుని ఆటోమొబైల్స్‌ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్‌) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్‌ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్‌లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్‌ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. 

ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్‌వేర్‌ పీఎల్‌ఐ స్కీమ్‌లో హెచ్‌పీ, డెల్‌, యాక్సర్‌ వంటి టెక్‌ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

చైనాకు గట్టి ఎదురుదెబ్బ!
చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!!

మరిన్ని వార్తలు