HPCL: నిత్యవసర వస్తువుల అమ్మకాల షురూ

4 Sep, 2021 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఇంధనేతర వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాపీ షాప్‌ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ముంబైలోని క్లబ్‌ హెచ్‌పీ పెట్రోల్‌ పంప్‌లో ప్రారంభించింది. 

ఆహార పదార్థాలు, సబ్బులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, బేకరీ, సరుకులు, మందుల వంటివి ఇక్కడ లభిస్తాయి. రోజువారీ అవసరమయ్యే వస్తువులను కస్టమర్ల సౌకర్యార్థం 24 గంటలూ  అందుబాటులోకి తేవడం కోసం స్టోర్‌ను తెరిచినట్టు కంపెనీ తెలిపింది. 

హెచ్‌పీ–పే యాప్‌ ద్వారా హోమ్‌ డెలివరీ సౌకర్యమూ ఉంది. ఇతర నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఖరీదైన కార్లు, బైక్స్‌ కోసం 100 ఆక్టేన్‌ రేటింగ్‌తో అల్ట్రా ప్రీమియం గ్రేడ్‌ పెట్రోల్‌ను పవర్‌ 100 పేరుతో హెచ్‌పీసీఎల్‌ అందుబాటులోకి తెచ్చింది.

చదవండి: స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు 

మరిన్ని వార్తలు