జూన్‌ నాటికి హెచ్‌పీసీఎల్‌ వైజాగ్‌ రిఫైనరీ విస్తరణ

23 Jan, 2023 13:58 IST|Sakshi

వారణాసి: ఈ ఏడాది జూన్‌ నాటికల్లా ఆంధ్రప్రదేశ్, వైజాగ్‌లోని ఆయిల్‌ రిఫైనరీ విస్తరణ పూర్తవుతుందని హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) చైర్మన్‌ పుష్ప్‌ జోషి తెలిపారు.

ఉత్పత్తికి, విక్రయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసుకునేందుకు హెచ్‌పీసీఎల్‌ వార్షికంగా 8.33 మిలియన్‌ టన్నులుగా (ఎంటీపీఏ) ఉన్న వైజాగ్‌ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంటీపీఏకి పెంచుకుంటోంది. దానితో పాటు రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌లో 9 ఎంటీపీఏ సామర్థ్యంతో కొత్తది నిర్మిస్తోంది.

ఇది 2024 ఆఖరు నాటికి  పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ తాను ఉత్పత్తి చేసే దానికన్నా 50 శాతం అధికంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీని విక్రయిస్తోంది.   

మరిన్ని వార్తలు