Huawei: టెస్లా కంటే తోపు కారును లాంచ్‌ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్‌ కంపెనీలకు చుక్కలే..!

26 Dec, 2021 17:31 IST|Sakshi

Huawei Unveils Aito M5 Hybrid Car Claims It Is Better Than Tesla Model Y: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ తయారీ సంస్థ టెస్లాకు ధీటైన ఎలక్ట్రిక్‌ కారును ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. టెస్లానే కాకుండా దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థలకు పోటీగా నిలుస్తోందని హువావే ప్రకటించింది. 

హువావే  ఐటో ఎమ్‌5
ఇటీవల చైనీస్‌ కంపెనీ హువావే అనేక దేశాల్లో ప్రతికూలతలు ఎదురైనాయి. అమెరికా లాంటి దేశాలు హువావేపై నిషేధాన్ని విధించాయి. ప్రస్తుతం హువావే ఆవిష్కరించిన ‘ఐటో ఎమ్‌5’ కారుతో ఆయా దేశాల్లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐటో ఎమ్‌5 కారును హువావే ప్రదర్శించింది. ఇక్కడ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్‌ కారు. విద్యుత్‌, ఇంధనంతో నడిచేలా ఐటో ఎమ్‌5ను హువావే ఆవిష్కరించింది.

స్పెసిఫికేషన్ల పరంగా ఈ వాహనం టెస్లా మోడల్ వైని అధిగమించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారులో హువావే రూపొందించిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హర్మోని ఒఎస్‌తో పనిచేయనుంది.  ఈ కారులో డబుల్ లేయర్డ్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది. 200కెడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో సుమారు 1000 కిమీ మేర ప్రయాణిస్తోందని హువావే పేర్కొంది. ఇది ఒక  హైబ్రిడ్‌ కారు కావున ఒకవేళ ఛార్జింగ్‌ జీరో అయినా కూడా నిర్విరామంగా ప్రయాణం కొనసాగించవచ్చును. 

ఐటో ఎమ్‌5 ధర ఎంతంటే..!
ఈ కారు విద్యుత్, ఇంధనం రెండింటితోనూ నడుస్తోంది. ఐటో ఎమ్‌5 ధర  250,000 యువాన్ (సుమారు రూ. 29,45,915)గా ఉంది. కాగా టెస్లా వై మోడల్‌ ధర 280,752 యువాన్  (సుమారు రూ. 33,07,887)గా ఉంది. అంటే హువావే ఆవిష్కరించిన కారు టెస్లా వై మోడల్‌ కంటే తక్కువ ధరలో లభించనుంది. చైనీస్‌ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి 20, 2022 నాటికి కస్టమర్లకు కారును డెలివరీ చేయడం ప్రారంభిస్తామని హువావే ఒక ప్రకటనలో వెల్లడించింది.

చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్‌ మస్క్‌..!

మరిన్ని వార్తలు