ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన హబుల్‌ టెలిస్కోప్‌..!

18 Jul, 2021 21:03 IST|Sakshi

విశ్వంతరాలను శోధించడానికి హబుల్‌ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్‌ తన సేవలను అందిస్తోనే ఉంది. గత నెలలో కంప్యూటర్‌లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్‌ టెలిస్కోప్‌ పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు నాసా ఇంజనీర్లు టెలిస్కోప్‌లో తలెత్తిన లోపాన్ని పరిష్కరించారు.

గత నెలలో ఏర్పడిన కంప్యూటర్‌ లోపం కారణంగా అబ్జర్వేటరీతో  అన్ని ఖగోళ పరిశోధనలు ఆగిపోయాయి. కాగా టెలిస్కోప్‌లో 1980 శకం కంప్యూటర్ల వలన లోపం తల్తెతడంతో టెలిస్కోప్‌ పరిశోధనలు ఆగిపోయాయని​ శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.  నాసా ఇంజనీర్లు గురువారం హబుల్‌ టెలిస్కోప్‌లో బ్యాకప్ పరికరాలకు విజయవంతంగా మార్చారు. దీంతో హబుల్‌ టెలిస్కోప్‌ పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నట్లు శుక్రవారం నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

టెలిస్కోప్‌లో తలెత్తిన లోపానికి పరిష్కారం చూపిన ఇంజనీర్లకు నాసా సైన్స్ మిషన్ చీఫ్ థామస్ జుర్బుచెన్ అభినందనలు తెలిపారు. 1990 లో ప్రారంభించిన హబుల్ విశ్వం గురించి ఇప్పటికీ వరకు 1.5 మిలియన్లకు పరిశోధనలను చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించాలని నాసా యోచిస్తోంది.

మరిన్ని వార్తలు