ఇంకా పనిచేయని హబుల్ స్పేస్ టెలిస్కోప్!

14 Jul, 2021 15:17 IST|Sakshi

కంప్యూటర్ లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ నెల తర్వాత కూడా పనిచేయడం లేదు. నాసా ఇంజనీర్లు ఇంకా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేదు. భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న ఈ టెలిస్కోపును 1990లో నాసా ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరును దీనికి పెట్టారు. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిది కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది శక్తివంతమైనది. ఈ అంతరిక్ష అబ్జర్వేటరీని తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఈ వారం చివర్లో బ్యాకప్ హార్డ్ వేర్కు మారాలని నాసా బృందాలు ఆలోచిస్తున్నాయి. 

బ్యాకప్ హార్డ్ వేర్ కు మారేటప్పుడు సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి నాసా ఒక సమీక్షను పూర్తి చేసినట్లు తెలిపింది. పేలోడ్ కంప్యూటర్ సమస్యకు గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది. హబుల్ సిస్టమ్స్ అనోమలీ రెస్పాన్స్ మేనేజర్ న్జింగా తుల్, నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ తో మాట్లాడుతూ.. "హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంప్యూటర్ తలెత్తిన చిన్న లోపం కారణంగా జూన్ 13న పనిచేయడం ఆగిపోయినప్పటి నుంచి ఆ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు కఠినంగా శ్రమిస్తున్నారు. "ప్రాథమిక పరిశోధనలు విజయవంతం కాకపోవడంతో, ఫార్మాట్ చేసిన బ్యాకప్ సైన్స్ డేటాకు మారడానికి సిద్ధమవుతున్నట్లు" తుల్ తెలిపారు. అయితే, బ్యాకప్ కంప్యూటర్ కు మారడం అంత సులభమైన పని కాదు, ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ లో గ్లిచ్డ్ పేలోడ్ కంప్యూటర్ కు సంబంధం లేని భాగాలు ఉన్నాయి, వాటిని కూడా వాటి బ్యాకప్ ఎలిమెంట్లకు మార్చాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు