ఎయిరిండియాకు భారీ షాక్‌, మిలియన్‌ డాలర్ల జరిమానా

15 Nov, 2022 13:14 IST|Sakshi

సాక్షి, ముంబై: టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.  కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్‌లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకుగాను భారీ జరిమానా విధించాలని అమెరికా ఆదేశించింది.  121.5 మిలియన్ డాలర్లు (దాదాపు  990 కోట్ల రూపాయలు) రీఫండ్‌తోపాటు జరిమానాగా 1.4 మిలియన్ డాలర్లు (రూ.11.35 కోట్లు) చెల్లించాలని  ఆదేశించింది. 

ఇదీ చదవండి: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్‌ సంచలన నిర్ణయం!

600 మిలియన్‌ డాలర్లకు పైగా వాపసు చెల్లించడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సోమవారం ప్రకటించింది. ఎయిరిండియా ‘రిఫండ్‌ ఆన్‌ రిక్వెస్ట్‌’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని పేర్కొంది. తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్  తెలిపారు. అలాగే ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ 222 మిలియన్‌ డాలర్లతోపాటు  2.2 మిలియన్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సిఉందన్నారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?)

మరిన్ని వార్తలు