‘ఎలాన్‌ మస్క్‌’కు కేంద్రం భారీ షాక్‌, దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు!

13 Sep, 2022 18:16 IST|Sakshi

భారతీయులకు శుభవార్త.త్వరలో మనదేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో తొలిసారి హై త్రూపుట్‌ శాటిలైట్‌ (హెచ్‌టీఎస్‌)బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే..దేశంతో పాటు రూరల్‌ ఏరియాల్లో సైతం హై స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను వినియోగించుకునే అవకాశం కలగనుంది. 

శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ హ్యూస్ కమ్యూనికేషన్స్ భారత్‌లో తొలిసారి శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవల్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇస్రో ద్వారా హై త్రూపుట్ శాటిలైట్ (HTS) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఈ శాటిలైట్‌ సేవల్ని అందించేందుకు ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించేందుకు అవసరమైన అనుమతుల్ని ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే శాటిలైట్‌ సర్వీసుల్ని అందించేందుకు కేంద్రం హ్యూస్‌ కమ్యూనికేషన్‌కు అనుమతి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. 

మాలక్ష్యం అదే
దేశంలో హైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల్ని అందించడమే హ్యూస్‌ సంస్థ లక్ష్యం. టెర్రెస్ట్రియల్ (terrestrial) నెట్‌ వర్క్‌ల తరహాలో వినియోగించే ఈ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఎంటర్‌ ప్రైజెస్‌, గవర్న్‌మెంట్‌ నెట్‌వర్క్‌లను అనుసంధానం కానున్నాయి. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడటానికి ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పని చేసే మార్గాలను అన్వేషించడానికి, విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాము" అని స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ,ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు.

మరిన్ని వార్తలు