HUL CEO Sanjiv Mehta: దిగిపోతున్న ఈ సీఈవో అందుకున్న పరిహారం రూ. 22 కోట్లు!

30 May, 2023 10:48 IST|Sakshi

త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) వ్యాపార దిగ్గజం హిందూస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సీఈవో, ఎండీ భారీ పరిహారాన్ని అందుకున్నారు. వచ్చే నెలలో దిగిపోతున్న సంజీవ్ మెహతా 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 22 కోట్లకు పైగా పరిహారాన్ని అందుకున్నారు. ఇందులో రూ. 6.3 కోట్ల బోనస్‌కూడా ఉంది. బోనస్ దాదాపు 50 శాతం పెరగడంతో సరాసరిగా మొత్తం పరిహారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే​ భారీగా పెరిగింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంతర్గత వ్యాల్యూమ్‌ వృద్ధిని సాధించిన హెచ్‌యూఎల్‌ 16 శాతం వృద్ధితో రూ. 58,154 కోట్ల  టర్నోవర్‌ సాధించింది. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన సంజీవ్‌ మెహతా పదవీకాలంలో జూన్‌ నెలలో ముగియనుంది.

ఇన్‌పుట్ కాస్ట్ ద్రవ్యోల్బణం కారణంగా తలెత్తిన కఠినమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని  కంపెనీ పోర్ట్‌ఫోలియో అత్యధిక మార్కెట్ వాటా పొందేలా చేసిన ఘనత సంజీవ్‌ మెహతాకు దక్కుతుంది. జూన్‌ 27న పదవి నుంచి దిగిపోతున్న సంజీవ్‌ మెహతా కొత్త సీఈవో రోహిత్‌ జావాకు బాధ్యతలు అప్పగించనున్నారు. సింగపూర్ పౌరుడైన రోహిత్‌ జావా కూడా రూ. 21 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇందులో రూ. 7 కోట్ల టార్గెట్ బోనస్‌కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్‌

మరిన్ని వార్తలు