మార్స్‌ మీదకు మనిషి!! తగ్గేదే లే.. ఎప్పుడంటే..

31 Dec, 2021 15:27 IST|Sakshi

స్పేస్‌ టూరిజం.. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మారిపోయింది. భూమి నుంచి 100 కిలోమీటర్లు దాటితే వచ్చే..  ఖర్మాన్‌ లైన్‌ను అంతరిక్షంగా ఫీలైపోతున్నారు. ఈ విషయంలో పోటీ స్పేస్‌ఏజెన్సీలకు దీటైన సమాధానమిస్తూ సిసలైన స్పేస్‌ యాత్రను.. అదీ సాధారణ పౌరులకు రుచి చూపించి శెభాష్‌ అనిపించుకున్నాడు ఎలన్‌ మస్క్‌. 


ఈ స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు ఆసక్తికర ప్రకటన చేశాడు. రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్‌ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్‌ఎక్స్‌ ద్వారానే సాధ్యమవుతుందని ధీమాగా చెప్తున్నాడు. ‘రాబోయే ఐదేళ్లలోనే మార్స్‌ మీదకు మనిషిని తీసుకెళ్లడం మా బాధ్యత. ఒకవేళ వరెస్ట్‌ సినారియో ఎదురైతే మాత్రం.. మరో పదేళ్లు పట్టొచ్చు. కానీ, ఆ పదేళ్ల నడుమ మార్స్‌ యాత్ర జరిగి తీరుతుంది. అందుకు నాదీ హామీ’అని ప్రకటించాడు ఎలన్‌ మస్క్‌. పాడ్‌కాస్టర్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్‌. 

అయితే డెడ్‌లైన్‌లను మిస్‌ కావడం ఎలన్‌ మస్క్‌కి కొత్తేం కాదు. గతంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సహా చాలా ప్రయోగాల విషయంలో ఇదే జరిగింది. కానీ, మార్స్‌ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్‌ మస్క్‌ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్‌ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్‌ఎక్స్‌ ప్రయోగానికి బీజం వేయించింది. మరి అలాంటిదాన్ని తప్పే ప్రసక్తే లేదనుకోవచ్చు మరి.

మరిన్ని వార్తలు