‘మేఘా’కు మహారాష్ట్ర సర్కార్‌ ప్రశంసలు  

12 Dec, 2022 10:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రతిష్టాత్మక సమృద్ధి మహామార్గ్‌ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసినందుకు గాను  హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌)ను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఆదివారం నాగ్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. హిందూ హృదయ సామ్రాట్‌ బాలాసాహెబ్‌ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ సీహెచ్‌ సుబ్బయ్యలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ  ప్రాజెక్టులో 85.40 కిలోమీటర్ల రెండు ప్యాకేజీలను ఎంఈఐఎల్‌ పూర్తి చేసింది. 

శివమడక నుండి నాగ్‌పూర్‌లోని ఖడ్కీ ఆమ్‌గావ్‌ వరకు 31. కి.మీ.లు, రెండో సెగ్మెంట్‌లో ఔరంగాబాద్‌ జిల్లాలోని బెండేవాడి నుండి ఫతివాబాద్‌ వరకు 54.40 కి.మీ. రహదారిని పూర్తి చేసింది. వయాడక్ట్‌లు, అండర్‌పాస్‌లు, వైల్డ్‌ యానిమల్‌ ఓవర్‌పాస్‌లు మొదలైన వాటిని నిర్మించింది. ఈ బృహత్‌ ప్రాజెక్టుతో నాగ్‌పూర్‌-ముంబై మధ్య ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గనుంది.

మరిన్ని వార్తలు