హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌ ప్రైమ్‌ సర్వీసులు

23 Nov, 2021 11:18 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికలు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది జీఎంఆర్‌ సంస్థ. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించే వారి కోసం అదనపు సౌకర్యాలు ప్రైమ్‌ సర్వీసుల పేరిట అందిస్తోంది. జీఎంఆర్‌ ప్రైమ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా ఫోన్‌లో నుంచే ఈ సర్వీసులను బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ చెక్‌ ఇన్‌, పర్సనలైజ్డ్‌ ప్యాసింజర్‌ అసిస్టెన్స్‌ సర్వీస్‌, పోర్టల్‌ సర్వీస్‌, లాంగ్‌ యాక్సెస్‌, ఫాస్ట్‌ ట్రాక్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ తదితర సేవలు ఉన్నాయి.


ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఏ విమానంలో ఈ క్లాసులో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట గుండా ప్రయాణం చేసే వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇంటర్నేషనల్‌, డొమెస్టిక్‌ రెండు టెర్మినళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానాశ్రయాల్లో హైదరాబాద్‌ ఒకటి. సుమారు ఆరు వేల కోట్లతో దీన్ని మరింతగా విస్తరించనున్నారు. దేశీయంగా ప్రధాన నగరాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌ కంట్రీలోని నగరాలకు నేరుగా విమానాలు నడిపే దిశగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు కస్టమర్‌ సర్వీసులు అందించేందుకు జీఎంఆర్‌ ప్రైమ్‌ని ప్రవేశపెట్టింది.

చదవండి:  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఫైన్‌.. కారణం ఇదే!

మరిన్ని వార్తలు