EV: ఆ స్కూటర్లు కూడా రీకాల్‌.. ఒకినావా బాటలో ప్యూర్‌ ఈవీ

22 Apr, 2022 12:07 IST|Sakshi

ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లకి ఫైర్‌ యాక్సిడెంట్లు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీంతో తమ కంపెనీకి చెందిన స్కూటర్ల నాణ్యతను పరిశీలించేందుకు అనేక ఈవీ కంపెనీలో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే హర్యానాకు చెందిన ఒకినావా తమ కంపెనీ స్కూటర్లను రీకాల్‌ చేయగా తాజాగా హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ ప్యూర్‌ ఈవీ కూడా రీకాల్‌ బాట పట్టింది.

హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీగా ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో దూసుకుపోతుంది ప్యూర్‌ ఈవీ సంస్థ. అనతి కాలంలోనే మార్కెట్‌లో పట్టు సాధించింది. అయితే ఇటీవల చెన్నైలో ప్యూర్‌ ఈవీకి చెందిన ఓ స్కూటర్‌ తగలబడిపోయింది. మరుసటి రోజే నిజామాబాద్‌లో ఛార్జింగ్‌లో ఉండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఇప్పటికే అమ్ముడైన స్కూటర్లను రీకాల్‌ చేసి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ప్యూర్‌ ఈవీ నిర్ణయించింది.

ప్యూర్‌ ఈవీకి చెందిన ఎంట్రన్స్‌ ప్లస్‌, పీ ప్లూటో 7జీ మోడల్స్‌కి సంబంధించి మొత్తం 2,000 స్కూటర్లను రీకాల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ కంపెనీకి చెందిన డీలర్ల ద్వారా స్కూటర్లను వెనక్కి తెప్పించుకుని బ్యాటరీల పనితీరు ఛార్జింగ్‌ అవుతున్న విధానం గురించి మరోసారి పరిశీలించనున్నారు.

చదవండి: ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం

మరిన్ని వార్తలు