చార్జ్‌నెట్‌ రూ.70 కోట్ల పెట్టుబడి

2 Aug, 2022 08:15 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ వసతుల కంపెనీ చార్జ్‌నెట్‌.. ఈవీ సొల్యూషన్స్‌ కంపెనీ బైక్‌వోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50,000లకు పైగా చార్జింగ్, స్వాపింగ్‌ కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేస్తారు. విస్తరణకు రూ.70 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు చార్జ్‌నెట్‌ కో–ఫౌండర్‌ చక్రవర్తి అంబటి తెలిపారు. ‘చార్జింగ్‌ ఉపకరణాలను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నాం.

ప్లాంటు సామర్థ్యం నెలకు 20,000 యూనిట్లు. దీనిని 18 నెలల్లో రెండింతలకు పెంచుతాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 200లకుపైగా చార్జింగ్‌ స్టేషన్స్‌ అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలతోసహా వన్‌స్టాప్‌ సొల్యూషన్స్‌ అందిస్తున్నట్టు బైక్‌వో కో–ఫౌండర్‌ విద్యాసాగర్‌ రెడ్డి చెప్పారు.

చదవండి: వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు