రయ్‌..రయ్‌.. రేసింగ్‌ కార్లు..ఫార్ములా ఇ- వన్‌ ఛాంపియన్‌షిప్‌

17 Jan, 2022 10:50 IST|Sakshi

హ్యాపెనింగ్‌ సిటీగా రెండు దశాబ్ధాలుగా దూసుకుపోతోంది హైదరాబాద్‌ నగరం. తాజాగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంచే మరో గొప్ప ఈవెంట్‌కి వేదికగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఫార్ములా వన్‌ తరహాలో ఇటీవల ఫేమస్‌ అయిన ఇ-వన్‌ ఛాంపియ్‌షిప్‌ని హోస్ట్‌ చేసేందుకు రెడీ అవుతోంది.

ఫార్ములా వన్‌ రేసింగ్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కార్పోరేట్‌ వరల్డ్‌లో ఈ పోటీలకు గుర్తంపు వేరే లెవల్‌లో ఉంటుంది. ఒలంపిక్స్‌ తరహాలో ఆయా దేశాలను తమ నగరాలకు ప్రమోట్‌ చేసుకునేందుకు ఫార్ముల వన్‌ రేసింగ్స్‌ నిర్వహిస్తుంటాయి. కాగా ఎలక్ట్రిక్‌ కార్ల వాడకం పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ తెర మీదకు వచ్చింది. 

పదో సీజన్‌కి
ఇ వన్‌​ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్‌ నగరం ఆతిధ్యం ఇ‍చ్చేందుకు సిద్ధమవుతోంది.

రయ్‌..రయ్‌..
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం... ఫార్ముల వన్‌ రేసింగ్‌ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్‌ అవసరం. కానీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌తో నిర్వహించే పోటీలకు ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేదు. నగరంలో అందుబాటులో ఉన్న రోడ్లపై రేస్‌ నిర్వహించవచ్చు. ఇప్పటి వరకు ఇ రేసింగ్‌ ఛాపింయన్‌షిప్‌కి నెక్లస్‌రోడ్డు - ట్యాంక్‌బండ్‌ సర్క్యూట్‌, కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న సర్క్యూట్‌ రోడ్డు, గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. 

కీలక చర్చలు
ఇ వన్‌ ఫార్ములా పోటీలు నిర్వహించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ చూపించారు... పలు దఫా చర్చల అనంతరం హైదరాబాద్‌ తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఫార్ములా ఇ అసోసియేషన్, తెలంగాణ, గ్రీన్‌కో సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఖరరానైట్టు అధికారి వర్గాలు వెల్లడించాయంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తుది చర్చలు 2022 జనవరి 17న జరుగునున్నాయి.


వెనక్కినెట్టి
ఇ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ రేస్‌కి ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలు సైతం పోటీ పడ్డాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం చూపిన చొరవ, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చివరకు హైదరాబాద్‌ మిగిలిన నగరాలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది.

బ్రాండ్‌ హైదరాబాద్‌
రేసింగ్‌ పోటీలకు కార్పోరేట్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్లే విజయ్‌మాల్యా, ఆనంద్‌ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలు సొంతంగా ఫార్ములా వన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పోటీలకు కనుక ఆతిధ్యం ఇస్తే హైదరాబాద్‌ నగర బ్రాండ్‌ ఇమేజ్‌ ప్రపంచ పటంలో మరింతగా వెలిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది.  

చదవండి: ఇలా చేస్తే కుదరదబ్బా ! ఝలక్‌ ఇచ్చిన కస్టమర్లు..ఇరకాటంలో ఓలా!

మరిన్ని వార్తలు