ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు

22 Apr, 2021 15:48 IST|Sakshi

హైదరాబాద్: "ఫోర్బ్స్ 30 అండర్ 30" ఆసియా జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. హైదరాబాద్ నగరానికి చెందిన మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రణవ్ వెంపతి, డీజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్‌ సింధీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని మేకర్స్ హైవ్ సంస్థ కృత్రిమ అవయవాలను తయారు చేస్తుంది. ఈ అంకుర సంస్థ ‘కల్‌ఆర్మ్‌’ అనే పేరుతో బయోనిక్‌ హ్యాండ్‌ తయారు చేసి, చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్‌ సహా అన్ని రకాల పనులు చేయొచ్చు. 

డీజీ-ప్రిక్స్ ఆన్‌లైన్ ఫార్మసీ సేవల సంస్థ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను మందులను హోమ్ డెలివరీ చేస్తారు. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ ప్రిస్క్రిప్షన్లను అప్‌లోడ్ చేసిన రోగులకు నెలవారీ మందులను డెలివరీ చేయడానికి హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ పనిచేస్తుంది. డెలివరీ ఉచితం, ఔషధ ధరలు స్థానిక ఫార్మసీల కంటే 15 శాతం వరకు చౌకగా ఉంటాయి. ఎందుకంటే డిజి-ప్రీక్స్ ఆర్డర్లు ఇవ్వడానికి పంపిణీదారులతో నేరుగా కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్‌ మతీన్‌ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. సమర్థ్‌ సింధీ బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. భారతదేశానికి తిరిగి రాకముందు అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేశాడు.

చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి!

మరిన్ని వార్తలు