4 Years For Hyderabad Metro: ఎన్ని కోట్ల లీటర్ల ఫ్యూయల్‌ ఆదా అయ్యిందో తెలుసా?

30 Nov, 2021 12:17 IST|Sakshi

భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమై నాలుగేళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్‌) సాధించిన ఘనతలను హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నాలుగేళ్లలో
తొలి దశలో నాగోల్‌ - అమీర్‌పేట - మియాపూర్‌ సెక‌్షన్లలో 30 కిలోమీటర్ల నిడివితో 2017 నవంబరు 29న మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. నాలుగు నెలల పాటు 15 నిమిషాలకు ఒక రైలు వంతున నడిపాం. ఆ తర్వాత క్రమంగా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ 5 నిమిషాలకు ఒక రైలు పీక్‌ అవర్స్‌లో 3 నిమిషాలకే ఒక రైలు వరకు తెచ్చాం. కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత పీక్‌ అవర్‌ ఫ్రీక్వెన్సీని 4.30 నిమిషాలుగా ఉంది. మెట్రో రైళ్లు 99 శాతం సమయ పాలనతో నడుస్తున్నాయి.

20 కోట్ల మంది
మెట్రో రైలు సర్వీసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 20.80 కోట్ల మంది రైడర్లు ఇందులో ప్రయాణం చేశారు. మెట్రో రైళ్లు సుమారుగా 1.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాయి. ఇదే ప్రయాణం పెట్రోలు, డీజిల్‌ ఇంజన్ల ద్వారా చేయాల్సి వస్తే 4.70 కోట్ల లీటర్ల ఫ్యూయల్‌ ఖర్చు అయ్యేది. 

పర్యావరణం
ఈ నాలుగేళ్లలో 110 మిలియన్‌ కిలోల కార​‍్బన్‌ డై యాక్సైడ్‌ వాతావరణంలో కలవకుండా మెట్రో అడ్డుకుంది. అంతేకాదు మెట్రో ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న సోలార్‌ సిస్టమ్‌ కారణంగా మరో 14 మిలియన్‌ కిలోల కార్బన్‌ డై యాక్సైడ్‌ అరికట్టగలిగారు.

చదవండి: ఢిల్లీ తరహాలో ఎయిర్‌పోర్ట్‌ వరకు హైదరాబాద్‌ ‘మెట్రో’

మరిన్ని వార్తలు