రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..

4 Apr, 2023 18:46 IST|Sakshi

ఇటీవల కాలంలో ఇన్‌స్టా‌గ్రామ్, ఫేస్‌బుక్‌లో వంటి సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రీల్స్ చేసి ఆకట్టుకోగల సత్తా ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేసి ఆకట్టుకున్న వారికి లక్ష బహుమతి అందివ్వనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అందించిన సమాచారం ప్రకారం.. రీల్స్ చేసే వారి కోసం ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో గెలిచిన వారికి ఒక లక్ష నగదు బహుమతి లభిస్తుంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా చూపరులను ఆకట్టుకునే విధంగా 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

మీరు పోస్ట్ చేసే వీడియోలో @DigitalMediaTS అని ట్యాగ్ చేయాలి. అంతే కాకుండా ఇలాంటి వీడియోలను dir_dm@telangana.gov.in కి కూడా మెయిల్ చేయవచ్చు. ఏప్రిల్ 30 చివరి నాటికి వీడియోలను పంపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. మరిన్ని వివరాలు కోసం https://it.telangana.gov.in/contest/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

గతంలో డబ్ ష్మాష్, టిక్ టాక్ వంటివి మంచి ట్రెండింగ్‌‌లో నడిచాయి, అయితే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో, రీల్స్ ట్రెండింగ్‌‌లో ఉన్నాయి. రీల్స్ చేస్తూ కాలం గడిపేవారికి ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి. వీడియోలన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిని తెలియజేయాలి.

>
మరిన్ని వార్తలు