యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ

26 Jun, 2021 11:09 IST|Sakshi

కోవిడ్‌ స్టార్టప్స్‌పై ట్రినిటీ ఛాలెంజ్‌, యూకే పోటీలు

ఫైనల్స్‌కి ఎంపికైన వివిధ దేశాలకు చెందిన 16 స్టార్టప్‌లు

మూడో స్థానంలో నిలిచిన  హైదరాబాద్‌ స్టార్టప్‌

కోవిడ్‌ వ్యాక్సిన్ల ట్రాక్‌, వేస్టేజీ నియంత్రణలో భేష్‌ 

హైదరాబాద్‌​ : నూతన ఆవిష్కరణలు, సరికొత్త సేవలు అందివ్వడంలో హైదరాబాద్‌ బేస్డ్‌ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ వేదికల మీద సైతం ప్రశంసలు పొందుతున్నాయి. బెస్ట్‌ అవార్డులకు అర్హత సాధిస్తున్నాయి.

కోవిడ్‌ కాంటెస్ట్‌
డేటా ఆధారిత కోవిడ్‌ సేవలకు సంబంధించి యూకేకి చెందిన ట్రినిటీ ఛాలెంజ్‌ సంస్థ ఇటీవల పోటీలు నిర్వహించగా గచ్చిబౌలిలో ఉన్న స్టాట్‌విగ్‌ సంస్థకు చెందిన వ్యాక్సిన్‌ లెడ్జర్‌ స్టార్టప్‌  రూ. 4.9 కోట్ల బహుమతి గెలుచుకుంది. ఫైనల్స్‌కి మొత్తం 16 స్టార్టప్స్‌ పోటీ పడగా వ్యాక్సిన్‌ లెడ్జర్‌ మూడో విజేతగా నిలిచింది. 

పనితీరు ఇలా
టీకా తయారైంది మొదలు అది తీసుకునే వ్యక్తి వరకు వ్యాక్సిన్‌ వయల్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం వ్యాక్సిన్‌ లెడ్జర్‌ ప్రత్యేకత. వ్యాక్సిన్‌ తయారీ నుంచి ఎయిర్‌పోర్టు, వ్యాక్సిన్‌ వెహికల్‌, స్టోరేజీ సెంటర్‌, రీజనల్‌ సెంటర్‌, సబ్‌సెంటర్‌, అంతిమంగా లబ్ధిదారుడు... ఇలా వ్యాక్సిన్‌ ప్రయాణించే ప్రతీ చోట అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది. ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ పాడవకుండా ఉందా ? లేదా ? ఇలా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ లెడ్జర్‌ పని చేస్తుంది. 

2 కోట్ల టీకాలు
ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా టీకాలను వ్యాక్సిన్‌ లెడ్జర్‌ ట్రాక్‌ చేసింది. ఎక్కడైనా ఉష్ణోగ్రత పెరిగిపోతే వెంటనే అలెర్ట్‌లు అందించింది. దీంతో పాటు చెడిపోయిన వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిప్పుడు వ్యాక్సిన్‌ లెడ్జర్‌ తెలియజేసింది. దీంతో వ్యాక్సిన్‌ వేస్టేజ్‌ గణనీయంగా తగ్గిపోయింది. 

రెండేళ్ల శ్రమ - చక్రవర్తి (స్టాట్‌విగ్‌, సీఈవో)
బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై 25 సభ్యులతో కూడి మా టీం రెండేళ్ల పాటు శ్రమించింది. యూనిసెఫ్‌ ఆర్థిక సహకారం అందించింది. మా వ్యాక్సిన్ లెడ్జర్‌ డేటా ఎనాలసిస్‌లో... టీకా తయారీ నుంచి లబ్ధిదారుడికి చేరేలోపు ప్రతీ 10 టీకాలలో 3 టీకాలు వృధా అవుతున్నట్టు తేలింది. ‍కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌తో ప్రతీ టీకా ఎంతో కీలకమైన దశలో... మా వ్యాక్సిన్‌ లెడ్జర్‌ని అందుబాటులోకి రావడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.  

చదవండి : ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా

మరిన్ని వార్తలు