హ్యుందాయ్‌ కెట్రాలో కొత్త మోడల్‌... తగ్గిన ధర

23 Jun, 2021 12:12 IST|Sakshi

ఎస్‌, ఎస్‌ఎక్స్‌ ఫీచర్స్‌తో వచ్చిన కొత్త మోడల్‌

ఎస్‌ఎక్స్‌ కంటే రూ. 78,000 తక్కువకే లభ్యం 

ఇండియా ఆటోమొబైల్‌ సెక్టార్‌లో స్పొర్ట్ప్‌ యూటిలిటీ వెహికల్‌​ సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తునే ధర తగ్గించి సంచలన నిర్ణయం తీసుకుంది హ్యుందాయ్‌. అధునాతన ఫీచర్లు, తక్కువ ధరతో  క్రెటా ఎస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్‌లోకి తెచ్చింది. 

క్రెటా ఎగ్జిక్యూటివ్‌
ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ మార్కెట్‌లో తిరుగులేదని ఆధిపత్యం చలాయిస్తోంది హ్యుందాయ్‌ క్రెటా మోడల్‌. క్రెటా ఎస్‌, హైఎండ్‌లో క్రెటా ఎస్‌ఎక్స్‌ వేరియంట్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. అయితే ఇతర కంపెనీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో మార్కెటింగ్‌ స్ట్రాటజీని మార్చింది హ్యుందాయ్‌. క్రెటా ఎస్‌, కెట్రా ఎస్‌ఎక్స్‌ వేరియంట్ల కలయికతో క్రెటా ఎస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ని హంగు ఆర్భాటం లేకుండా ప్రవేశపెట్టింది. పైగా క్రెటా ఎస్‌ఎక్స్‌తో పోల్చితే ఎస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కారు ఎక్స్‌ షోరూం ధరలో రూ. 78,000 తక్కువకే ఇది లభిస్తోంది. 

లేటెస్ట్‌ ఫీచర్స్‌
క్రెటా ఎస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వేరియంట్‌లో యాంటెన్నా, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, బ్లూటూత్‌ మైక్‌, యూఎస్‌బీ పోర్టులు వంటి ఫీచర్లు అందించింది. అయితే మ్యూజిక్‌ సిస్టమ్‌ని ఇన్‌బిల్ట్‌గా కాకుండా యాక్సెసరీగా అందివ్వనుంది. మరోవైపు ఎస్‌ఎక్స్‌ వేరియంట్‌లలో ఉన్న డోర్‌ హ్యాండిల్‌ క్రోమ్‌, రియర్‌ వ్యూ మానిటర్‌, వాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, బర్‌గ్లర్‌ అలారమ్‌ వంటి ఫీచర్లు ఎగ్జిక్యూటివ్‌లో లేవు. అయితే ఎక్కువ మంది ఇష్టపడే సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ సేవలు అందించే యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ వంటి ఆటో ఫీచర్లు అందించింది. క్రెటా ఎస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వేరియంట్‌లో 1.5 లీటర్‌ పెట్రోలు / డీజిల్‌ ఇంజన్‌ అమర్చారు. 

చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు