స్పోర్టీ లుక్‌తో హ్యుందాయ్‌ ఐ20 కారు

25 Aug, 2021 21:32 IST|Sakshi

వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తాజాగా స్పోర్టీ లుక్‌తో ఐ20 ఎన్‌-లైన్‌ కారును ప్రవేశపెట్టింది. ఎన్‌-లైన్‌ శ్రేణిలో యువ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన తొలి మోడల్‌ ఇది. ప్రస్తుతం ఈ శ్రేణి మోడళ్లను యూరప్, దక్షిణ కొరియా, యూఎస్, రష్యా వంటి దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. స్పోర్టీ లుక్‌ కోసం కారు వెలుపలా, లోపలా పలు మార్పులు చేశారు. (చదవండి: మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు)

1 లీటర్‌ పెట్రోల్‌ టర్బో జీడీఐ ఇంజిన్‌ పొందుపరిచారు. 6 స్పీడ్‌ ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్‌ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టింది. 120 పీఎస్‌ పవర్, నాలుగు డిస్క్‌ బ్రేక్స్, 50కిపైగా కనెక్టివిటీ ఫీచర్స్, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలో అందుకుంటుంది. సన్‌రూఫ్‌ కోరుకునే కస్టమర్ల సంఖ్య 2018లో 13 శాతముంటే ప్రస్తుతం 30 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు