టెస్లాకు షాక్‌: స్లీక్‌ అండ్‌ స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సెడాన్‌, రేంజ్‌ ఎంతో తెలిస్తే

14 Jul, 2022 18:47 IST|Sakshi

టెస్లాకు ధీటుగా హ్యుందాయ్ ఎలక్ట్రిక్ సెడాన్‌

హ్యుందాయ్  ఐయోనిక్‌-6 లాంచ్‌

Hyundai IONIQ 6:  లగ్జరీ  కార్‌  మేకర్‌ టెస్లాకు షాకిచ్చేలా ‍ హ్యుందాయ్ తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 6ని విడుదల చేసింది.  ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని వాహన తయారీ సంస్థ వెల్లడించింది. ఇదే నిజమైతే లాంగ్-రేంజ్ టెస్లా మోడల్ 3 కంటే మెరుగైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టెస్లా ఆధిపత్యం చలాయిస్తున్న ఈవీ మార్కెట్‌లో పాగా వేసే లక్ష్యంతో `ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్‌లైనర్` ఐయోనిక్-6 సెడాన్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్‌పై 602 కిలోమీటర్లు దూసుకుపోతుంది. 5.1 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

12 రంగులలో అలరించనున్న హ్యుందాయ్ ఐయోనిక్ 6 కేవలం 18 నిమిషాల్లో 350-kW ఛార్జర్‌తో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.  ఈవీ పెర్ఫార్మెన్స్ ట్యూన్-అప్ ఎలక్ట్రిక్ యాక్టివ్ సౌండ్ డిజైన్ (e-ASD) తో అత్యంత ఏరోడైనమిక్ స్టైలింగ్‌ డ్యూయల్ కలర్,  యాంబియంట్ లైటింగ్, స్పీడ్ సింక్ లైటింగ్, అత్యాధునిక ఫీచర్లున్న కారు ఇదేనని హ్యుందాయ్ మోటార్ ప్రెసిడెంట్ , సీఈవో జేహూన్ చాంగ్ తెలిపారు. 

అల్ట్రా-ఫాస్ట్, మల్టీ-ఛార్జింగ్ సామర్థ్యం, డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్ 64 కలర్స్‌ స్పెక్ట్రమ్ , స్పెషల్‌  థీమ్స్‌,  స్పీడ్ సింక్ లైటింగ్ మోడ్, నాలుగు టైప్-సి, ఒక టైప్-ఏ యూఎస్‌ బీ పోర్ట్‌లు, సిస్టమ్ డ్రైవర్ స్టీరింగ్ ఎఫర్ట్, మోటార్ పవర్, యాక్సిలరేటర్ పెడల్ సెన్సిటివిటీ లాంటివి ఫీచర్లు ఇందులో జోడించినట్టు చెప్పారు.  

విశాలమైన ఇంటీరియర్‌, ప్రత్యేకమైన సీట్లు, స్లీక్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో వినియోగదారులు మనసు దోచుకుంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డివిజన్ హెడ్ థామస్ స్కీమెరా అన్నారు. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో విక్రయించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఇండియాలో ఎపుడు తీసుకొచ్చేది కూడా స్పష్టత లేదు.  

మరిన్ని వార్తలు