వినియోగదారులకు 'హ్యుందాయ్‌' శుభవార్త, తక్కువ ధరకే..

10 Aug, 2021 02:21 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ‘‘షీల్డ్‌ ఆఫ్‌ టస్ట్ర్‌ సూపర్‌’’ పేరుతో మెయింటెనెన్స్‌ సర్వీసులను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్త కారుకు ఐదేళ్లు గడువు లేదా 50వేల కిలోమీటర్ల దూరం సేవలను అందిస్తామని తెలిపింది.

బ్రేక్‌లు, క్లచ్, వైపర్, బెల్ట్‌తో సహా మొత్తం 14 ప్రధాన భాగాల రిపేర్లు ఈ సర్వీసు పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్‌కు చెందిన 10 మోడళ్లలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వాహన నిర్వహణ వ్యయ నియంత్రణ లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు