నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కొలువులు!

23 Sep, 2022 12:51 IST|Sakshi

ముంబై: బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సౌర్సింగ్‌ (బీపీవో) సేవల సంస్థ ఐసీసీఎస్‌ వివిధ విభాగాల్లో దాదాపు 7,000 మందిని రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ మేరకు నియామకాలు జరపనున్నట్లు సంస్థ సీఈవో దివిజ్‌ సింఘాల్‌ తెలిపారు.

కస్టమర్‌ సపోర్ట్, ఆపరేషన్స్, మార్కెట్‌ రీసెర్చ్, మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో హైరింగ్‌ ఉంటుందని వివరించారు. ఐసీసీఎస్‌కి ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో డెలివరీ సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6,600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.

చదవండి: పండుగ సీజన్‌.. కొత్త బైక్‌ కొనేవారికి షాక్‌!

మరిన్ని వార్తలు